Begin typing your search above and press return to search.
టైం బాగోలేనప్పుడు అమూల్ బేబీ మాటలు పంచ్ లే అవుతాయి
By: Tupaki Desk | 24 Dec 2019 7:55 AM GMTకాలం కలిసి రాని వేళ టెంకాయ సైతం టైంబాంబు మాదిరి పేలుతుందని ఊరికే అనరు మరి. రాజకీయాల్లో కొంతమంది నేతలపై పడే ముద్రల్ని చెరిపేయటం అంత తేలికైన విషయం కాదు. ఎక్కడి దాకానో ఎందుకు? కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించి.. తర్వాతి కాలంలో కాడి కింద పడేసిన రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించినంతనే ఆయన్ను అమూల్ బేబీగా అభివర్ణిస్తుంటారు. సొట్ట బుగ్గలున్న ఆయన్ను సింఫుల్ గా తేల్చేస్తుంటారు. ఆయనకు రాజకీయ పరిపక్వత కూడా అంతంతే అన్న విమర్శలు వినిపిస్తుంటాయి.
ఒకటి తర్వాత ఒకటి హిందీ బెల్ట్ లోని రాష్ట్రాల్లో అధికారం చేజారిపోతున్న వేళ.. రాహుల్ ను గతంలో మాదిరి నోటికి వచ్చినట్లు మాటలు అనలేని పరిస్థితి. దీనికి తోడు ఇటీవల కాలంలో మోడీ సర్కారు చేసిన పౌరసత్వ సవరణ చట్టంపైనా.. ఎన్నార్సీపైనా దేశ వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు.. నిరసనలు మోడీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇలాంటివేళ.. ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు వింటే ఆయన మాటలు మరింత చురుకుగా మారటమే కాదు.. సూదుల్లా గుచ్చుకుంటున్నాయని చెప్పక తప్పదు. మోడీని ఉద్దేశించి తాజాగా రాహుల్ గాంధీ కాస్తంత ఆగ్రహంతో.. మీరు ధరించే దుస్తులను బట్టి దేశానికి మీరెవరో అర్థమైపోయింది. రూ.2కోట్ల విలువైన సూట్ ధరించిన వ్యక్తి మీరు. అవి దేశంలోని సామాన్యులు ధరించే దుస్తులు కావు అంటూ మండిపడ్డారు.
ఇటీవల జరిగిన జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. నిరసనకారులు ఎవరన్నది వారు ధరించిన దుస్తులను బట్టి చెప్పొచ్చొంటూ చేసిన వ్యాఖ్యలకు రాహుల్ తాజాగా ఘాటు కౌంటర్ ఇచ్చారని చెప్పాలి. తన మాటల్ని తనకే టైమ్లీగా పంచ్ రూపంలో వేసిన రాహుల్ మాటల్ని విన్న తర్వాత ఎవరూ ఆయన్ను అమూల్ బేబీ అంటూ ఎటకారం చేసే అవకాశం ఉండదని చెప్పక తప్పదు.
మోడీ దుస్తుల మీద కౌంటర్లు వేసి రాహుల్ అక్కడితో ఆగకుండా.. మోడీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిన వైనాన్ని తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. మన శత్రువులు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసేందుకు చాలానే ప్రయత్నించారు.. వాళ్లేమీ చేయలేకపోయారు.కానీ శత్రువులు కూడా చేయని పనిని ప్రధాని మోడీ ఇవాళ చేస్తున్నారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. దెబ్బ మీద దెబ్బ పడుతున్న వేళ రాహుల్ వ్యాఖ్యల్లో వేడి మాత్రమే కాదు.. వాడి కూడా పెరిగిందని చెప్పాలి.