Begin typing your search above and press return to search.

రాహుల్ ఎంఫిల్.. ఉత్త ఫేక్

By:  Tupaki Desk   |   14 April 2019 7:49 AM GMT
రాహుల్ ఎంఫిల్.. ఉత్త ఫేక్
X
బీజేపీ కేంద్రమంత్రి సృతీ ఈరానీ విద్యార్హతల వివాదం కొత్త మలుపు తిరిగింది. గత ఎన్నికల్లో డిగ్రీ చదివినట్లుగా నామినేషన్లో పేర్కొన్న సృతీ తాజాగా దాఖలు చేసిన నామినేషన్లో మాత్రం అండర్ గ్యాడ్యుయేట్ అని పేర్కొనడంతో ఆమె విద్యార్హత వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇది కొత్త రచ్చకు దారితీసింది. కేంద్ర మంత్రి హోదాలో ఉంటూ ఇలా తప్పుడు విద్యార్హతల్ని ఇస్తారా అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సైతం దీనిపై మండిపడుతున్నారు.

దీనిపై కేంద్రంలోని బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ అధ్యక్షుడికి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్హత మీద సందేహాలను వ్యక్తం చేశారు. రాహుల్ ఎంఫిల్ పట్టా మీద జైట్లీ సందేహాలు వ్యక్తం చేశారు. రాహుల్ 1995లో ఎంఫిల్ పట్టాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి అందుకున్నట్టు విశ్వవిద్యాలయం పేర్కొందని.. అందులో తేడా ఉందని పేర్కొన్నారు.

అరుణ్ జైట్లీ మాట్లాడుతూ .. 1981-83 మధ్య రాహుల్, ప్రియాంకలు డెహ్రాడూన్ లోని డూన్ స్కూల్లో చదివారని.. 1984లో ఇందిర హత్య తర్వాత వారిద్దరిని స్కూల్ మాన్పించి ఇంట్లోనే చదివించారని తెలిపారు. అనంతరం ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో రాహుల్ బీఏ పూర్తి చేశాడని తెలిపారు. అక్కడ ఫస్ట్ ఇయర్ పూర్తయ్యాక అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో చేరాడని తెలిపారు. 1991లో రాజీవ్ హత్య తర్వాత రాహుల్ ను ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీలో చేరారని వివరించారు. రాహుల్ 1994లో డిగ్రీ పట్టా పొందారని వివరించారు. ఏడాది వ్యవధిలోనే ట్రినిటీ కాలేజీ నుంచి ఎంఫిల్ పట్టా పుచ్చుకున్నారని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకటించిదని తెలిపారు.

దీనిపైనే అరుణ్ జైట్లీ సందేహాలు వ్యక్తం చేశారు. ఎక్కడైనా డిగ్రీకి, ఎంఫిల్ కు మధ్య ఏడాది మాత్రమే వ్యత్యాసం ఉంటుందా అని ప్రశ్నించారు. కేంబ్రిడ్స్ యూనివర్సిటీలో ఎంఫిల్ ఏడాదిలో పూర్తి చేయడం కుదరదని.. రాహుల్ ఎంఫిల్ ఎలా చేశాడని ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.