Begin typing your search above and press return to search.

రాహుల్ ఇంకో సెటైర్ వేశారు

By:  Tupaki Desk   |   22 Dec 2016 6:48 PM IST
రాహుల్ ఇంకో సెటైర్ వేశారు
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మ‌రోమారు మండిప‌డ్డారు. గుజ‌రాత్ సీఎంగా ఉన్న‌ప్పుడు ప్ర‌ధాని మోదీ స‌హారా గ్రూపు నుంచి ముడుపులు తీసుకున్నార‌ని ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. రాహుల్‌ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని స్పందించి యువ‌నేత‌ మాట్లాడారు కాబ‌ట్టి ఇక భూకంపం రాద‌ని ఎద్దేవా చేశారు. ఈ ప‌రిణామంపై మ‌ళ్లీ రాహుల్ రియాక్ట‌య్యారు. ఉత్తరప్రదేశ్‌ బహరోచ్‌ లో ఆక్రోశ్‌ ర్యాలీలో పాల్గొన్న ఆయన రాహుల్‌ ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. తనపై విమ‌ర్శ‌లు చేయ‌డం బానే ఉంది కానీ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చెప్తార‌ని ప్ర‌శ్నించారు. 2012 - 2013 సంవత్సరాల్లో తీసుకున్న ప్యాకెట్లలో ఏముందో చెప్పాలంటూ ప్ర‌ధాన‌మంత్రిని రాహుల్ డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రిపై రాహుల్ నిప్పులు చెరిగారు. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు ఆయ‌న అవినీతికి పాల్ప‌డ్డారా లేదా అనే విష‌యంపై ప్ర‌ధాన‌మంత్రి క్లారిటీ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అవినీతి గురించి తాను ప్ర‌స్తావిస్తుంటే..భూకంప గురించి, సెటైర్లు వేస్తూ మోదీ దాట‌వేస్తున్నార‌ని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు వెనుక కూడా అనేక అంశాలు ఇమిడి ఉన్నాయ‌ని రాహుల్ పేర్కొన్నారు. పేద‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ప్ర‌జ‌లంద‌రినీ క్యూ లైన్లో నిల‌బ‌డేలా చేసిన ఘ‌న‌త ప్ర‌ధాన‌మంత్రిద‌ని వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌ల గురించి తాము అనేక అంశాల‌ను విన్న‌విస్తున్న‌ప్ప‌టికీ... ప్ర‌ధాన‌మంత్రి ఏమాత్రం స్పందించ‌డం లేద‌ని రాహుల్ మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/