Begin typing your search above and press return to search.

ఏపీలో రాహుల్ పాదం...జగన్ తో డైరెక్ట్ గానే ...?

By:  Tupaki Desk   |   11 Aug 2022 12:30 AM GMT
ఏపీలో రాహుల్ పాదం...జగన్ తో డైరెక్ట్ గానే ...?
X
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాదయాత్రకు కౌంట్ డౌన్ మొదలైంది. అన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్ నుంచి రాహుల్ గాంధీ దేశవ్యాప్త పాదయాత్ర మొదలవుతుంది. ఈ యాత్ర ఏకంగా నూటాభై రోజుల పాటు సాగనుంది. అలాగే దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో సగం అంటే 13 పైగా రాష్ట్రాలను రాహుల్ టచ్ చేస్తారని అంటున్నారు.

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ పాదయాత్ర కాశ్మీర్ టూ కన్యాకుమారి దాకా అని ఒక రూట్ మ్యాప్ ని కాంగ్రెస్ పెద్దలు రెడీ చేశారు. రాహుల్ తన పాదయాత్రను సౌత్ నుంచే మొదలుపెడతారు అని చెబుతున్నారు. ఆయన ఈ ఏడాది చివరలో రెండు తెలుగు రాష్ట్రాలలో కాలు మోపుతారని అంటున్నారు. రూట్ మ్యాప్ లో మొదట కేవలం తెలంగాణా మాత్రమే ఉందని చెబుతున్నారు. కానీ మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఏపీలో కూడా రాహుల్ పాదం మోపుతారు అని అంటున్నారు.

ఏపీలో ఆయన ఎక్కడ అడుగు పెడతారో తెలియదు రూట్ మ్యాప్ మీద పూర్తి స్పష్టత వస్తేకానీ అది తేలదు. కానీ ఏపీలో జగన్ ఏలుబడి సాగుతోంది. జగన్ అంటే ఒకనాటి కాంగ్రెస్ నాయకుడు. యూపీఏ ప్రభలు వెలుగుతున్న రోజుల్లో ఆయన సోనియాగాంధీని ధిక్కరించి బయటకు వచ్చారు. నాడు యువరాజుగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ ని శాసిస్తూ ఉన్నారు. అంటే జగన్ ఆయన్ని కూడా ఎదిరించినట్లు లెక్క.

మరి పాదయాత్ర ఏపీలో కనుక చేస్తే ఆయన కచ్చితంగా ఏపీ రాజకీయాల మీద జగన్ మీద మాట్లాడాల్సి ఉంటుంది. రాహుల్ ఏమి మాట్లాడుతారు అన్న ఆసక్తి అయితే ఉంటుంది. జగన్ మీద ఆయన ఇప్పటిదాకా పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆ మాటకు వస్తే ఏపీ మీద కాంగ్రెస్ కి ఆశలు ఏవీ అంతగా ఉన్నట్లుగా తోచదు. కానీ ఇపుడు దేశంలో మారుతున్న వాతావరణం బట్టి ఏపీలో కూడా ఎంతో కొంత కూడగట్టుకోవాలన్న కొత్త ఆలోచనలు అయితే కాంగ్రెస్ పెద్దలకు వస్తున్నాయట.

అందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర ఏపీలో ఉండేలా చేశారు అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో రాహుల్ గాంధీ పక్కాగా పాదయాత్ర ఉంటుందని పీసీసీ చీఫ్ సాకే సైలజానాధ్ అంటున్నారు. ఏపీలో రాహుల్ పాదయాత్రను తాము విజయవంతం చేస్తామని చెబుతున్నారు. మోడీ జపంతో ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న జగన్ సర్కార్ ని ఎడగడతామని కూడా చెబుతున్నారు. చూడాలి మరి రాహుల్ వర్సెస్ జగన్ పొలిటికల్ యాక్షన్ సీన్ ఎపుడు జనాల ముందుకు వస్తుందో.