Begin typing your search above and press return to search.
రాహుల్ హత్యకేసు :పరారీలో విజయ్..ఆ గొడవలే కారణమా ?
By: Tupaki Desk | 22 Aug 2021 12:30 AM GMTవిజయవాడలో సంచలనం రేపిన యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసులో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 302, 120 B రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. రాహుల్ తండ్రి కరణం రాఘవరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు పోలీసులు వెల్లడించారు. A1 కోరాడ విజయ్, A2 కోగంటి సత్యం, A3 విజయ్ భార్య పద్మజ A4 పద్మజ, A5 గాయత్రిగా ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు వెల్లడించారు.
ఈ హత్య కేసులో నిందితుడైన కోరాడ విజయ్, రాహుల్ వ్యాపార భాగస్వాములని పోలీసులు తెలిపారు. రాహుల్ హత్య కేసులో పోలీసులు కోగంటి సత్యం అనుచరుడు శ్యామ్ ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత శ్యామ్ మీడియా తో మాట్లాడుతూ..తాను కోగంటి సత్యం వద్ద పనిచేసిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. రాహుల్ హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పారు. తాను హత్య చేస్తే విజయవాడలో ఎందుకుంటానని అన్నారు. పోలీసులు తనను పిలిచి విచారించారని చెప్పారు.
ఈ కేసులో కోరాడ విజయ్ కుమార్ ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రాహుల్ కు, విజయ్ కుమార్ కు మధ్య వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పలుసార్లు పంచాయతీ కూడా జరిగిందని చెబుతున్నారు. ఈ వివాదం కారణంగానే విజయ్ కుమార్ రాహుల్ హత్యకు ప్రణాళిక రచించి అమలు చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
2016లో జి.కొండూరులో జిక్సన్ సిలిండర్ కంపెనీ ప్రారంభించాడని , 2019 ఎన్నికల్లో పోటీ చేసి విజయ్ నష్టపోయాడని తెలిపారు. తన షేర్లు తీసుకుని డబ్బు ఇవ్వాలని రాహుల్ పై విజయ్ ఒత్తిడి తెచ్చాడని, రాహుల్ వద్ద డబ్బు లేకపోవడంతో షేర్లు తీసుకోలేదని వివరించారు. అదేవిధంగా కోగంటి సత్యంకు కంపెనీ అమ్మాలని విజయ్ ఒత్తిడి తెచ్చాడని, అయితే కంపెనీ అమ్మేందుకు రాహుల్ అంగీకరించలేదని పేర్కొన్నారు. కోగంటి సత్యం, విజయ్, భార్య పద్మజ, గాయత్రి రాహుల్ పై ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. రాహుల్ ఇళ్లు విడిచి వెళ్లేటప్పుడు రెండు ఫోన్లు తీసుకెళ్లాడని తెలిపారు. 18వ తేదీన రాత్రి 7 గంటలకు రాహుల్ బయటకు వెళ్లాడని, అతను తిరిగి రాకపోవడంతో 19న తండ్రి కరణం రాఘవరావు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ వేగంగా జరుగుతుంది. పరారీలో ఉన్న కోరాడ విజయ్ కుమార్ ఎక్కడ ఉన్నాడో తెలిస్తే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.