Begin typing your search above and press return to search.
ప్రధాని రేసులో రాహుల్ లేరట..
By: Tupaki Desk | 11 April 2019 5:35 AM GMTదేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీచడం.. రైతుబంధు, కనీస ఆదాయ హామీతో కాస్త కాంగ్రెస్ కు మొగ్గు కనిపిస్తోందన్న అంచనాల నేపథ్యంలోనే కాంగ్రెస్ కు అదిరిపోయే షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్సీపీ అధినేత శరద్ పవర్.. రాహుల్ గాంధీకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. బీజేపీయేతర పక్షాలతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని.. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని కాలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్టీఏ కూటమి ఓటమి తప్పదని శరద్ పవార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కూటమి గెలిచాక భాగస్వామ్య పక్షాలు ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటారని తెలిపారు. కానీ ప్రధాని పదవి కోసం రాహుల్ గాంధీ పోటీలో లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాహుల్ దృష్టి మొత్తం మోడీని ఓడించడంపైనే ఉందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 100 అంతకన్నా ఎక్కువ మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని శరద్ పవార్ అంచనావేశారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ అభ్యర్థిత్వాన్ని అన్నీ పార్టీలు అంగీకరించాయని.. ఈసారి పదవీ కోసం పోటీ ఉంటుందని తనకు అనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ లేదంటే మిత్రపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేస్తామని శరద్ పవార్ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ కూడా రాదని శరద్ పవార్ స్పష్టం చేశారు.
ఇలా అన్నీ సానుకూలంగా పవనాలు ఉన్న వేళ బీజేపీ లక్ష్యం చేసిన ప్రధానిగా రాహుల్ అన్ ఫిట్ నినాదానికి బలం చేకూరేలా శరద్ పవర్ మాట్లాడడం కాంగ్రెస్ ను కలవరపెడుతోంది.