Begin typing your search above and press return to search.

మోడీ జీడీపీ పెరుగుదలపై రాహుల్ సెటైర్లు

By:  Tupaki Desk   |   25 Jan 2021 1:30 AM GMT
మోడీ జీడీపీ పెరుగుదలపై రాహుల్ సెటైర్లు
X
పట్టాపగ్గల్లేకున్నా పెరిగిపోతున్న ధరాఘాతం దెబ్బకు సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇక దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇక జీఎస్టీ పేరుతో విచ్చలవిడిగా వసూళ్లు సాగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ నియంత్రణను వదిలేసి చోద్యం చూస్తున్న పరిస్థితి నెలకొంది.

దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న ధరలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. నరేంద్రమోడీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వట్ చేశారు.

ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతుంటే పన్నులు వసూలు చేయడంలో మోడీ బిజీగా ఉన్నాడని పేర్కొన్నారు. ఇంధన ధరల పెరుగుదలతో జీడీపీ భారీగా వృద్ధి చెందిందని సెటైర్లు వేశారు.

శనివారం నాలుగోసారి రేట్లు పెంచిన తరువాత దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చమురు ధరల పెరుగుదలకు ప్రధాన కారణం సౌదీ చమురు ఉత్పత్తిని తగ్గించడమే కారణమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు.

కరోనా వైరస్ కారణంగా చమురు ఉత్పత్తి చేసే అనేక దేశాలు ఉత్పత్తిని నిలిపివేశాయి. తగ్గించాయి.. డిమాండ్, సరఫరాలో అసమతుల్యత కారణంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దీనిపై రాహుల్ గాంధీ సెటైర్లు కురిపించారు.