Begin typing your search above and press return to search.

మోదీ ప్రకటనపై రాహుల్ ఏమన్నాడంటే..?

By:  Tupaki Desk   |   19 Nov 2021 6:34 AM GMT
మోదీ ప్రకటనపై రాహుల్ ఏమన్నాడంటే..?
X
వ్యవసాయంలో ప్రైవేటీకరణ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ ఇవాళ ప్రకటించారు. అంతేకాకుండా రైతులకు ఇబ్బంది కలిగినందుకు క్షమాపణలు చెప్పారు. అయితే ప్రధాని ప్రకటన తరువాత దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. కొత కొన్నేళ్లుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

అయితే పార్లమెంట్ లో ఈ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని రైతు సంఘాల నాయకులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. ప్రధాని మోదీ ప్రకటన తరువాత ఆయన చేసిన ట్వీట్ పై రకరకాల చర్చలు సాగుతున్నాయి.

‘రైతుల సత్యాగ్రహానికి కేంద్రం తలవంచక తప్పలేదు. రైతుల ఆందోళనతో కేంద్రం తన ఇగోను పక్కటనబెట్టింది. ’ అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా గతంలో ఆయన రైతు చట్టాలపై చేసిన వ్యాఖ్యలను కూడా ఈ పోస్టుకు జోడించారు. అయితే రైతుల ఉద్యమాలతో ప్రభుత్వాలకు ఎన్నిటికైనా చెడ్డపేరే వస్తుందని, ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండునని అన్నారు. ఏదీ ఏమైనా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైందేనని అన్నారు.

మరోవైపు వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాలను రద్దు చేస్తామని మోదీ అన్నారు. రైతుల ఆదాయం పెంచేందుకే వ్యవసాయ చట్టాలను రూపొందించామన్నారు. ఆయితే రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో చట్టాలను వెనక్కి తీసుకోక తప్పడం లేదని మోదీ అన్నారు. అయితేకొందరు రైతులను ఒప్పించడంలో విఫలమైనట్లు తెలిపారు.

ఈ క్రమంతో రైతులకు ఎన్నో ఇబ్బందులు జరిగాయని, దీంతో ఇబ్బంది కలిగిన రైతులకు క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు.

అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటించగానే ఉద్యమం విరమించమని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. పార్లమెంట్ లో ఆ చట్టాలను పూర్తిగా రద్దు చేసిన తరువాత ఆందోళన విరమిస్తామని రైతు సంఘం నాయకుడు టికాయత్ పేర్కొన్నాడు. కొన్నేళ్లుగా ఎన్నో కష్టాలనెదుర్కొని ఈ ఉద్యమం చేస్తున్నానమని, ప్రకటన చేసినంత మాత్రాన ఆందోలన విరమించమని అన్నారు. పూర్తిగా వాటిని రద్దు చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు.