Begin typing your search above and press return to search.
జగన్ కారణంగానే రాహుల్ కు బిగ్ బాస్ టైటిల్
By: Tupaki Desk | 7 Nov 2019 4:26 AM GMTవిన్నంతనే విచిత్రంగా అనిపించటమే కాదు.. ఇదెక్కడి విష ప్రచారమని అనుకోవచ్చు కానీ బిగ్ బాస్ సీజన 3 విజేతగా హైదరాబాదీ కుర్రాడు రాహుల్ సిప్లిగంజ్ నిలవటం తెలిసిందే. విస్మయానికి గురి చేసలా కొందరు విజేత గురించి వ్యాఖ్యానిస్తున్నా..ఈ కుర్ర సింగర్ కు పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉందంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే వరకూ పెద్ద బజ్ లేని రాహుల్.. ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకోవటం వెనుక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమంటున్నారు.
విజేతగా నిలిచి అందరిని సర్ ప్రైజ్ కు గురి చేస్తున్న రాహుల్ కు ఇంత ఫాలోయింగ్ ఎక్కడిది? అంత గుర్తింపు ఎలా సాధ్యమైంది? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తాను ఇంట్లో ఎలా ఉన్నానో.. బిగ్ బాస్ హౌస్ లోనూ అలానే ఉన్నానని చెబుతున్నాడు రాహుల్. అయితే.. తన గెలుపునకు కారణం వైఎస్ జగన్ అన్న విషయం తాను హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసిందంటున్నాడు.
అదెలా అంటే.. ఏపీ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి పై తాను కంపోజ్ చేసిన ఒక పాటను పాడాడు. అది అప్పట్లో వైరల్ కావటమే కాదు.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్న జగన్ ఫ్యాన్స్ గంపగుత్తగా రాహుల్ కు ఓటేసి ఉంటారన్న మాట వినిపిస్తోంది. దీన్ని బలపరుస్తూ రాహుల్ కు యూ ట్యూబ్ పాలోవర్స్ 5 లక్షలకు పైన ఉండటమే కాదు.. అతడి పాటలకు 10 కోట్లకు పైనే వ్యూస్ ఉండటం కూడా రాహుల్ ను విజేతగా నిలుపటంలో కీలకభూమిక పోషించినట్లు చెబుతున్నారు. ఇప్పుడీ వాదన విన్న తర్వాత బిగ్ బాస్ విజేతగా రాహుల్ అవతరించటం వెనుక జగన్ కారణమన్న వాదనకు కన్వీన్స్ అవుతున్నారని చెప్పక తప్పదు.