Begin typing your search above and press return to search.

అమరీందర్ ను సీఎంగా ఎందుకు తొలగించామో చెప్పిన రాహుల్ గాంధీ..

By:  Tupaki Desk   |   18 Feb 2022 6:31 AM GMT
అమరీందర్ ను సీఎంగా ఎందుకు తొలగించామో చెప్పిన రాహుల్ గాంధీ..
X
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శల వాన వ్యక్తమవుతోంది. బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన పంజాబ్ సీఎం చన్నీ టార్గెట్ గా మారారు. మోడీ పంజాబ్ పర్యటనలో ఆయనను 20 నిమిషాలు నిలిపివేసేలా చేశాడని బీజేపీ గుర్రుగా ఉంది. ఇక కాంగ్రెస్ సైతం పంజాబ్ లో బలంగా ఉండి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

ఇక కాంగ్రెస్, ఆప్ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. ఇటీవల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చిన్నపిల్లలు అని మాజీ సీఎం అమరీందర్ సింగ్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.

తాజాగా ఫతేఘర్ సామిబ్ లో రాహుల్ గాంధీ పర్యటించారు. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ సీఎంగా అమరీందర్ సింగ్ ను ఎందుకు తొలగించారో తాను చెబుతానన్నారు.

పేద ప్రజలకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు ఆయన అంగీకరించికపోవడం వల్లే సీఎంగా అమరీందర్ ను తొలగించడానికి కారణం అన్నారు. తనకు నాకు విద్యుత్ సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందం ఉందని కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారన్నారు.

పంజాబ్ లో డ్రగ్స్ వ్యవహారంపై కూడా రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ దేశానికి ముప్పు అని తాను చెబుతూనే ఉన్నానన్నారు. పంజాబ్ ప్రయోగాలు చేయవలసిన రాష్ట్రం కాదని ఇప్పుడు చెబుతున్నానని అన్నారు. పంజాబ్ లోని యువత జీవితాలను డ్రగ్స్ నాశనం చేయడం కొనసాగితే పంజాబ్ లో అభివృద్ధి అర్థరహితమన్నారు.

అమరీందర్ సింగ్ కు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. ముగ్గురు నలుగురు పారిశ్రామికవేత్తల చేతిలో పాలన ఉండేదని వివరించారు. ఇటు ఆప్ పై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. పంజాబ్ ఏమన్నా కెమెస్ట్రీ ల్యాబ్ నా? ప్రయోగాలు చేయడానికి అని అడిగారు. విద్యుత్ సమస్య పరిష్కరించలేదని.. పేదలను దగ్గరకు తీయలేదని రాహుల్ ఆరోపించారు.