Begin typing your search above and press return to search.
స్మగ్లింగ్ కోసం మెక్సికో టు అమెరికాకు సొరంగం
By: Tupaki Desk | 26 Oct 2015 5:49 AM GMTఈ మధ్య విడుదలై ఘన విజయం సాధించిన భజరంగీ భాయిజాన్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. దారి తప్పిన పాకిస్థానీ చిన్నారిని వారి దేశానికి తీసుకెళ్లి.. వారి తల్లిదండ్రులకు అప్పగించటానికి హీరో పాస్ పోర్ట్ కోసం ప్రయత్నించటం.. అది సాధ్యం కాకపోవటంతో రెండో మార్గంపై దృష్టి పెడతాడు.
సరిహద్దుల్లోకి చేరుకున్న అతడికి పాక్ లోకి రహస్యంగా తీసుకెళ్లేందుకు ఒక బ్రోకర్ భారత సరిహద్దుల్లోని సొరంగం నుంచి పాక్ సరిహద్దుల్లోకి ఒక సొరంగం ద్వారా తీసుకెళతారు. సినిమాల్లో మాత్రమే సాధ్యం కానీ.. రియల్ లైఫ్ లో సాధ్యమేనా? అన్న సందేహం పలువురికి కలుగుతుంది.
తాజా ఉదంతం చూస్తే అదెంత వరకూ నిజమో తెలిసిపోతుంది. తాజాగా మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా వేసిన ఒక సొరంగాన్ని అమెరికా అధికారులు గుర్తించారు. గంజాయి స్మగ్లింగ్ కోసం ఈ భారీ సొరంగాన్ని నిర్మించినట్లు తేలింది.
సొరంగం మాత్రమే కాదు.. అందులో రైలు పట్టాలు కూడా వేయటం విశేషం. గంజాయిని అక్రమంగా తరలించేందుకు నిర్మించిన ఈ సొరంగాన్ని చూసిన అమెరికా అధికారులు అవాక్కు అయ్యారు. మెక్సికో లోని తిజువానాలోని ఒక గౌడన్ నుంచి అమెరికా సరిహద్దుల్లోని శాండియాగోలోని మరో గౌడన్ వరకున్న ఈ సొరంగ మార్గాన్ని తాజాగా గుర్తించారు. దాదాపు 730 మీటర్లు పైనే ఉన్న ఈ సొరంగ మార్గం ద్వారా సుమారు రూ.39 కోట్ల విలువైన గంజాయిని తరలించి ఉంటారని భావిస్తున్నారు. భద్రత భారీగా ఉంటుందని భావించే అమెరికాలోనే ఇన్ని సొరంగాలు ఉన్నాయంటే.. భారత్ సరిహద్దుల వెంట మరెన్ని రహస్య సొరంగాలు ఉంటాయోనన్న సందేహం కలగక మానదు.