Begin typing your search above and press return to search.
జూన్ లో రైళ్ల కూత.. బస్సులపై సస్పెన్స్?
By: Tupaki Desk | 10 May 2020 7:45 AM GMTమే 17తో మూడో విడత లాక్ డౌన్ ముగుస్తోంది. తర్వాత ఏం చేయాలనే దానిపై కేంద్రంలో కసరత్తు మొదలైంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఇప్పటికిప్పుడు ప్రజా రవాణా ప్రారంభించడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఇప్పటికే దేశ ప్రజలను 50 రోజులుగా ఇళ్లలోనే కట్టేశారు. మరీ శృతిమించితే ఆందోళనలు చెలరేగే పరిస్థితి తలెత్తుతుంది. అమెరికాలో లాగా జనాలు రోడ్డెక్కే పరిస్థితులుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రజా రవాణా ప్రారంభించాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తించినట్టు తెలిసింది.
ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా జూన్ మొదటి వారంలో రైళ్ల రాకపోకలను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. ఇక ఆర్టీసీ బస్సుల ప్రారంభాన్ని రాష్ట్రాలకే వదిలేసింది.
ఇప్పటికే గ్రీన్ జోన్లలో బస్సుల ప్రారంభానికి కేంద్రం అనుమతిచ్చింది. ఆరెంజ్ - రెడ్ జోన్లలో అనుమతి ఇవ్వలేదు. రైళ్లు ప్రారంభిస్తే భౌతిక దూరం నిబంధన అమలయ్యే అవకాశాలు కష్టమే. అందుకే ఈనెల 17న రైల్వేసేవలపై కేంద్రం నిర్ణయం తీసుకోబోతోంది.
తెలంగాణలో మరో వారం రోజుల్లో 80శాతం గ్రీన్ జోన్ గా జిల్లాలన్నీ మారుతాయి. హైదరాబాద్ చుట్టుపక్కల తప్ప తెలంగాణ అంతటా గ్రీన్ జోన్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో బస్సులను మే చివరి వారం నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇక మొదట సగం మందితో ప్రయాణాలు కల్పిస్తారు. డిపోల్లో ఖచ్చితంగా థర్మో స్క్రీనింగ్ పరికరాలు పెట్టి ప్రయాణికులను పరీక్షించాకే బస్సుల్లోకి అనుమతిస్తారు.