Begin typing your search above and press return to search.
కాలిన రత్నాచల్ బోగీల వేలం
By: Tupaki Desk | 24 March 2016 10:47 AM GMTనెలన్నర కిందట తునిలో కాపు గర్జన సందర్భంగా జరిగిన ఘర్షణల్లో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ తగలబడిపోయిన సంగతి తెలిసిందే. ఆ మంటల్లో మొత్తం 17 బోగీలు కాలిపోయాయి. కొద్ది రోజుల విరామం తరువాత కొత్త బోగీలు తెచ్చి మళ్లీ రత్నాచల్ ను పురుద్ధరించారు. అయితే.. కాలిపోయిన బోగీలు ఎందుకూ పనికిరావు కాబట్టి వాటిని స్క్రాప్ కింద విక్రయించాలని రైల్వే శాఖ నిర్ణయించుకుంది. అందుకుగాను టెండర్లు పిలిచింది.
ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఈ కాలిన బోగీలను కొనదలిచినవారు టెండర్లు దాఖలు చేయొచ్చంటూ తాజాగా ప్రకటన ఇచ్చారు. జనవరి 30న జరిగిన ఈ ఘటనలో రత్నాచల్ బోగీలు 17 పూర్తిగా కాలిపోయాయి. వాటి కోసం పిలుస్తున్న టెండర్లలో ఎక్కువ ధరను కోట్ చేసినవారికి వాటిని విక్రయిస్తారు.