Begin typing your search above and press return to search.
రైల్వే బడ్జెట్ కు కేంద్రం చెల్లుచీటి!
By: Tupaki Desk | 21 Sep 2016 9:13 AM GMTవచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్ ను మాత్రమే ప్రవేశపెట్టనుంది. రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్ లోనే ఉండనుంది. ఈ మేరకు నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం రైల్వే బడ్జెట్ కు చెల్లుచీటి ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. బ్రిటిష్ పాలనా పద్దతులను ఒంటబట్టించుకున్న భారత పాలకులు సాధారణ బడ్జెట్ మాదిరే ఏటా రైల్వేలకు ప్రత్యేకంగా బడ్జెట్ ను ప్రవేశపెడుతూ వచ్చారు. రైల్వే బడ్జెట్ కు చెల్లుచీటి ఇవ్వాలన్న వాదన అప్పుడప్పుడు తెరపైకి వచ్చినా... ఆ దిశగా ఏ ప్రభుత్వం కూడా ధైర్యం చేయలేకపోయింది.
తాజాగా రెండున్నరేళ్ల క్రితం మూదు దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ సంపూర్ణ మెజారిటీతో గద్దెనెక్కిన నరేంద్ర మోదీ... సాహసోపేత నిర్ణయాలతో దూసుకెళుతున్నారు. ఇప్పటికే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసిన మోదీ సర్కారు దాని స్థానంలో నీతి ఆయోగ్ ను రంగంలోకి దించింది. రైల్వే బడ్జెట్ కు తిలోదకాలివ్వాలన్న ప్రతిపాదనకు కూడా మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫలితంగా వచ్చే ఏడాది పార్లమెంటు ముందుకు కేవలం సాధారణ బడ్జెట్ మాత్రమే రానుంది. రైల్వే బడ్జెట్ అన్న మాటే ఇక వినపడదు. రైల్వే పద్దులకు సంబందించిన జమా ఖర్చులన్నీ కూడా సాధారణ బడ్జెట్ లో ఓ భాగంగా ఉంటాయి.