Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రికి అరెస్ట్ వారెంట్‌..!

By:  Tupaki Desk   |   20 July 2015 9:00 AM GMT
ఏపీ మంత్రికి అరెస్ట్ వారెంట్‌..!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రులిద్ద‌రికి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఆందోళ‌న చేయ‌టం త‌ప్పు కాదు కానీ.. వాటి విచార‌ణ సంద‌ర్భంగా ఎంత ఉన్న‌త స్థానంలో ఉన్న కోర్టు ముందు హాజ‌రు కావాల్సిన అవ‌స‌రం ఉంది. మంత్రులుగా త‌మ‌కున్న ప‌లుకుబ‌డి.. హోదాతో కోర్టు ఆదేశాల్ని ప‌ట్టించుకోక‌పోతే ఏం జ‌రుగుతుంద‌న్న‌ది తాజాగా ఏపీ మంత్రి.. అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేకు తెలిసి వ‌చ్చి ఉంటుంది.

ఏపీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు.. అధికార‌పార్టీకి చెందిన ఎమ్మెల్యే అల‌పాటి రాజాల‌కు రైల్వే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా.. రాష్ట్రం క‌లిసి ఉండాలంటూ ఈ ఇద్ద‌రు నేత‌లు రైల్ రోకోలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నేత‌లిద్ద‌రిపై కేసులు న‌మోద‌య్యాయి.

వాటి విచార‌ణ‌కు వారు రైల్వే కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉంది. అయితే.. కోర్టు నుంచి వ‌చ్చిన ఆదేశాల్ని ప‌ట్టించుకోక‌పోవ‌టంతో.. వారిని అరెస్ట్ చేయాలంటూ వారెంట్ ఇష్యూ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. మంత్రిగా.. ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కోర్టు ఆదేశాల్ని ప‌ట్టించుకోక‌పోతే ఇలాంటి స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయి.