Begin typing your search above and press return to search.
తొందరలోనే రైల్వేశాఖ బాదుడు తప్పదా ?
By: Tupaki Desk | 28 July 2022 5:23 AM GMTఆదాయాన్ని పెంచుకునేందుకు తొందరలోనే రైల్వేశాఖ మామూలు జనాలను బాదేందుకు రెడీ అవుతోంది. అన్నీ రైళ్ళల్లోను ప్రీమియం తత్కాల్ పద్దతిని ప్రవేశ పెట్టబోతోందట. ఇప్పటికే తత్కాల్ పద్దతిలో టికెట్లు బుక్ అవుతున్న విషయం తెలిసిందే. తత్కాల్ అంటేనే రెగ్యులర్ రిజర్వేషన్ ఛార్జీలకన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. అలాంటిది ప్రీమియం తత్కాల్ అంటే తత్కాల్ పద్దతిలో వసూలు చేసే ఛార్జీల కన్నా ఇంకా ఎక్కువుంటుంది.
ఇప్పటికే ప్రీమియం తత్కాల్ పద్దతి దేశంలోని 80 రైళ్ళల్లో అమల్లో ఉంది. జనాల ఆలోచనలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రీమియం తత్కాల్ పద్దతిని అన్నీ రైళ్ళల్లోను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ రెడీ అయిపోతోంది. ఇది కూడా డైనమిక్ షేర్ పద్దతిలో అమలవ్వబోతోంది. డైనమిక్ షేరంటే ప్రీమియం తత్కాల్లో టికెట్లు బుక్కయ్యే కొద్దీ మిగిలిన టికెట్ల ధరలు పెరిగిపోతాయి. ఉదాహరణకు ఈ పద్ధతిలో హైదరాబాద్ నుంచి తిరుపతికి 40 టికెట్లు ఉన్నాయని అనుకుందాం.
ఒక్కో టికెట్ బుక్కయ్యేకొద్దీ టికెట్ ధర పెరిగిపోతుంటుంది. మామూలుగానే తాత్కాల్ కన్నా తత్కాల్ ప్రీమియంలో ఎక్కువ ధర ఉంటుంది. అందులోను డైనమిక్ ఫేర్ పద్దతిలో టికెట్ల ధరలంటే విమానం టికెట్ ధరకన్నా ఎక్కవైపోయినా ఆశ్చర్యంలేదు. ఈ పద్దతిలో చివర టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకుడికి తిరుపతి దాకా వెళ్ళకుండా రైల్వేశాఖే పూర్తిగా క్షవరం చేసేస్తుందేమో.
ఇదంతా ఎందుకంటే దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఒత్తిళ్ళను తట్టుకోలేక వృద్ధులకు రాయితీలను మళ్ళీ ప్రవేశపెట్టక తప్పేట్లు లేదు. కరోనా వైరస్ కు ముందు వృద్ధుల్లో మగవాళ్ళకు 60 ఏళ్ళు, మహిళల్లో 58 దాటిన వాళ్ళకు అన్నీ తరగతుల్లో రాయితీలు వర్తించేది. అయితే కరోనా కారణంగా అన్నీ రాయితీలను రద్దు చేసిన రైల్వేశాఖ తర్వాత కొన్ని రాయితీలను మాత్రమే పునరుద్ధరించింది.
వృద్ధుల రాయితీని పూర్తిగా రద్దు చేసేసింది. దీనివల్ల సుమారు 5 కోట్లమందిపైన బాగా భారం పడుతుందని సమాచారం. దీంతో దేశమంతా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. దాంతో రాయితీలను పునరుద్ధరించబోతున్న రైల్వేశాఖ కక్కుర్తిపడి ప్రీమియం తత్కాల్ పద్దతిని తీసుకురాబోతోంది. మరి దీనిపై జనాలు ఎలా స్పందిస్తారో చూడాలి.