Begin typing your search above and press return to search.
కొందరికి మాత్రమే తగ్గనున్న రైల్వే చార్జీలు
By: Tupaki Desk | 7 Oct 2017 10:21 AM GMTప్రధాని కుర్చీలో మోడీ కూర్చుంటే చాలు.. తమకు చాలానే మేలు జరుగుతుందని తెగ ఫీలైపోయిన వారిలో మధ్యతరగతి వర్గం ముఖ్యమైంది. ఇంతకాలం తమను పట్టించుకోని రాజకీయ పార్టీలకు తమ సత్తా ఏమిటో చాటాలని అనుకునేవారు. అందుకు తగ్గట్లే సార్వత్రిక ఎన్నికల టైంలో ఎవరూ అడగకున్నా.. మోడీపై తమకున్న అభిమానాన్ని ప్రచారం రూపంలో చాటుకున్నారు. మోడీ కానీ.. ప్రధాని అయితే.. ఏం జరుగుతుందో తెలుసా? అంటూ.. కమలనాథుల ప్రచార విభాగం పోస్ట్ చేసిన పోస్టులను తెగ వైరల్ చేసే వారు.
మోడీ పవర్లోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నా.. ఇంతవరకూ తమకు ఒరిగిందేమీ లేదన్న విషయాన్ని ఇటీవల కొద్దికాలంగా గుర్తించటమే కాదు.. మోడీ తీరుపై కినుకుగా ఉన్నారు. పెట్రోల్ ధరల విషయంలో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఇలాంటి వారి మనసుల్ని దోచుకునేందుకు కేంద్రం ఇప్పుడు చిన్నపాటి బిస్కెట్ ఒకటి వేసింది.
ట్రైన్ ఛార్జీలను తగ్గించే ప్రక్రియకు తెర తీశారు. ఏ మాత్రం అవకాశం చిక్కినా.. వడ్డించే అలవాటున్న మోడీ బ్యాచ్‌కి టికెట్ ధరలు తగ్గించటం కూడానా? అన్న సందేహం వచ్చిందా? అయితే మీ అనుమానం కొంతమేర నిజమే. రైల్వే టికెట్ ధరల్ని ఏకమొత్తంలో తగ్గించటం లేదు. కాకుంటే.. ఆన్ లైన్లో బుక్ చేసుకునే వారికి.. ఈ టికెట్ల మీద విధించే మర్చంట్ డిస్కౌంట్ మొత్తాన్ని తీసి వేయాలని మాత్రం భావిస్తున్నారు.
ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ద్వారా రైల్వే టికెట్లను కొనుగోలు చేసే వారు.. తాము చెల్లించే డెబిట్.. క్రెడిట్ కార్డులకు సర్వీసు ఛార్జీలు విధిస్తుంటాయి. అయితే.. దీన్ని తగ్గించేందుకు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా రైల్వే మంత్రి పీయూష్ గోయిల్ చెబుతున్నారు. బ్యాంకులతో జరిపిన చర్చలు ఓకే అయితే అన్ లైన్లో కొనుగోలు చేసే టికెట్ల ధరలు తగ్గిపోతున్నాయి. భారీ వ్యత్యాసం రాకున్నా.. ఎంతో కొంత తగ్గించామన్న ఫీలింగ్ వినియోగదారుడికి కలుగుతుంది. నిత్య ఆశాజీవి అయిన మధ్యతరగతి జీవిని ఆకట్టుకోవటానికి పెద్దగా ఖర్చు కాని ఐడియాలో మోడీ పరివారం దగ్గర చాలానే ఉన్నాయని చెప్పాలి.