Begin typing your search above and press return to search.

ట్రైన్ టిక్కెట్టు క్యాన్సిలా.. జర జాగ్రత్త బాస్

By:  Tupaki Desk   |   7 Nov 2015 4:23 AM GMT
ట్రైన్ టిక్కెట్టు క్యాన్సిలా.. జర జాగ్రత్త బాస్
X
ప్రయాణాల సందర్భంగా ట్రైన్ జర్నీని చాలామంది ఆసక్తి ప్రదర్శిస్తారు. పెరిగిన ప్రయాణాలతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తగ్గట్లు పెరగాల్సిన విధంగా కొత్త రైళ్లు అందుబాటులోకి రాకపోవటంతో జనాలకు మరింత ఇబ్బందిగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైళ్లల్లో రిజర్వేషన్ల కోసం జనాలు పడుతున్న పాట్లు అన్నిఇన్నీ కావు. ఈ నేపథ్యంలో.. ట్రైన్ లలో రిజర్వ్ సీట్ల కోసం వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. దీన్ని అధిగమించేందుకు ఎవరికి వారు అవకాశం ఉన్న రైళ్లలో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఒకదాన్లో కాకుంటే మరో ట్రైన్ లో అయినా బెర్త్ కన్ఫర్మ్ అవుతుందన్న ఆశతో ఇలాంటి పని చేస్తున్నారు.

మరి.. ఈ విషయాన్ని గుర్తించిందో ఏమో కానీ రైల్వేశాఖ రిజర్వ్ టిక్కెట్ల క్యాన్సిలేషన్ల మీద దృష్టి పెట్టింది. ఇప్పటివరకూ వసూలు చేస్తున్న క్యాన్సిలేషన్ ఫీజును ఒక్కసారిగా రెట్టింపు చేయటమే కాదు.. ఈ నిర్ణయాన్ని వెనువెంటనే అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో మాదిరి ఇష్టారాజ్యంగా టిక్కెట్లు బుక్ చేసుకోవటం.. అనంతరం క్యాన్సిల్ చేసుకునే విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా.. భారీగా డబ్బు నష్టపోయే పరిస్థితి. మొత్తంగా చూస్తే ఇప్పుడున్న క్యాన్సిలేషన్ మొత్తాన్ని డబుల్ చేయటంతో పాటు.. సమయం కూడా తగ్గిపోనుంది.

మారనున్న నిబంధనల కారణంగా క్యాన్సిలేషన్ భారం భారీగా ఉండనుంది.

= రైలు బయలుదేరటానికి 6 గంటల ముందు.. రైలు బండి బయలుదేరిన తర్వాత 2 గంటల్లోపు టిక్కెట్టును రద్దు చేసుకుంటే 50 శాతం మొత్తం తిరిగి ఇచ్చేవారు. ఈ నిబంధనను తాజాగా మార్చారు. దీని ప్రకారం.. రైలు బయలుదేరటానికి 12 గంటల నుంచి నాలుగు గంటల ముందు వరకు మాత్రమే టిక్కెట్టును క్యాన్సిల్ చేసుకునే సదుపాయం ఉంది. అంటే.. ప్రయాణానికి కొద్ది గంటల ముందు (4 గంటల కంటే తక్కువ సమయంలో) టిక్కెట్టు క్యాన్సిల్ సాధ్య పడదు.

= ప్రయాణానికి 48 గంటల ముందు క్యాన్సిలేషన్ కు సంబంధించి పలు మార్పులు చేశారు.

= ఫస్ట్ ఏసీ టిక్కెట్ క్యాన్సిలేషన్ కు ఇప్పుడున్న రూ.120 నుంచి రూ.240కు పెరగనుంది.

= సెకండ్ ఏసీ విషయానికి వస్తే ఇప్పుడున్న రూ.100 నుంచి రూ.200 కానుంది.

= థర్డ్ ఏసీ క్యాన్సిలేషన్ ఫీజు రూ.90 నుంచి రూ.180గా నిర్ణయిచారు.

= స్లీపర్ క్లాస్ క్యాన్సిలేషన్ రూ.60 నుంచి రూ.120కు పెంచారు.

= సెకండ్ క్లాస్ క్యాన్సిలేషన్ రూ.30 కాస్త రూ.60కు పెరగనుంది.