Begin typing your search above and press return to search.
రైల్వే టికెట్లను కార్డులతో కొనేయొచ్చు
By: Tupaki Desk | 14 Dec 2016 6:44 AM GMTపెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చేతిలో ఉన్న పెద్ద నోట్లు మొత్తం చెల్లని కాసులుగా మారిపోయి.. బ్యాంకుల వద్దకు వెళ్లిపోవటం.. తిరిగి క్యాష్ గా తెచ్చుకుందామంటే నిబంధనలు అడ్డుకోవటం.. పరిమితులు.. నోట్ల కొరతతో.. తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న పరిస్థితి.
దీంతో..క్యాష్ కంటే కూడా ఆన్ లైన్ ద్వారా నగదును బదిలీ చేసే పద్ధతికి ప్రతిఒక్కరూ మొగ్గు చూపుతున్న పరిస్థితి. దీనికి తోడుగా కార్డులతో లావాదేవీలు జరిపే వారు రోజురోజుకి పెరిగిపోతున్నారు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా పలు మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. దీనికి తగ్గట్లే దక్షిణ మధ్య రైల్వే కూడా కీలమైన నిర్ణయాన్ని తీసుకుంది.
తమ రైల్వే టికెట్ కౌంటర్ల వద్ద నగదుతో కాకుండా.. డెబిట్.. క్రెడిట్.. రూపే కార్డులతో చెల్లింపులకు ఓకే అనేలా సరికొత్త యంత్రాల్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తమ జోన్ పరిధిలోని 37 ప్రాంతాల్లో 100 మెషిన్లను సిద్ధం చేసింది. తొలుత.. పెద్ద స్టేషన్లలో కార్డులతో టిక్కెట్లను అమ్ముతారు. అనంతరం.. మిగిలిన స్టేషన్లలోఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. సికింద్రాబాద్.. హైదరాబాద్.. విజయవాడ.. గుంటూరు.. గుంతకల్.. నాందేడ్ డివిజన్ పరిధిలో ఈ యంత్రాల్ని ఏర్పాటు చేశారు.
కార్డులతో టికెట్లను కొనుగోలు చేసే వారిపై ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయని రీతిలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. డెబిట్.. క్రెడిట్.. రూపే కార్డులతో రైల్వే టికెట్లను కొనుగోలు చేసే వీలు కలగనుంది. టికెట్లు కొనుగోలు.. క్యాన్సిల్ చేసినా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయని రీతిలో నిర్ణయం తీసుకోవటంతో ప్రయాణికులకు అదనపు భారం పడే అవకాశం లేదు. సో.. కార్డుతో రైల్వే టికెట్లు కొనేయొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/