Begin typing your search above and press return to search.

అకాల వర్షం... ఆశీర్వాద హర్షం...

By:  Tupaki Desk   |   14 Dec 2018 6:32 AM GMT
అకాల వర్షం... ఆశీర్వాద హర్షం...
X
శీతాకాలం. చలి కొరికే కాలం. వెచ్చగా దుప్పటి కప్పుకుని నిద్రపోవాలనుకునే కాలం.కాని ఇదేమిటీ.... వర్షం దంచేసింది అనుకుంటున్నారు తెలంగాణ వాసులు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండో సారి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన కొద్ది గంటల్లోనే నగరంలో కొన్ని వర్షం కురిసింది.ఆ తర్వాత గురువారం రాత్రంతా చాలా చోట్ల వర్షం పడుతూనే ఉంది. ఇది దేనికి సంకేతం అని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజానికి దైవభక్తిని ఎక్కువగా ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆశీర్వదించేందుకే వరుణుడు కరుణించాడని కొందరంటున్నారు.

మరి కొందరు మాత్రం అబ్బే అదేం లేదు.... అకాలంలో వర్షమంటే ఏదో ఇబ్బందే అని పెదవి విరుస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే గురువారం నాడు కురిసిన వర్షం శుభసూచకమేనని జ్యోతిషులు - పండితులు అంచనా వేస్తున్నారు. రెండు నెలలుగా కురివని వర్షాలు గురువారం నాడు ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర రావు ప్రమాణం చేసిన వెంటనే కురిసాయంటే తెలంగాణ భవిష్యత్ బంగారమేనని వారంటున్నారు. రాష్ట్రంలో ముందు ముందు మరిన్ని వర్షాలు కురుస్తాయని - పంటలు పండుతాయనడానికి సంకేతమంటున్నారు.

తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రచారం పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి పలు ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు నచ్చలేదని - ఇందుకే ప్రజా కూటమికి వ్యతిరేకంగా భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితికి విజయాన్ని అందించారంటున్నారు. ఎన్నికలు - అనంతరం ఓట్ల లెక్కింపుతో తుపాను వచ్చిందని - గురువారం కురిసిన వర్షం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆశీర్వాదమే అని వారంటున్నారు. ఇది దేవుడు అడగకుండా ఇచ్చిన వరమని వారు నిర్దారిస్తున్నారు.