Begin typing your search above and press return to search.

భారత్‌ - న్యూజిలాండ్‌ మ్యాచ్‌ కు మళ్లీ వరుణ భయం..!

By:  Tupaki Desk   |   7 July 2019 6:40 PM GMT
భారత్‌ - న్యూజిలాండ్‌ మ్యాచ్‌ కు మళ్లీ వరుణ భయం..!
X
ఐసీసీ వరల్డ్‌ కప్‌ 2019 తుది అంకంకు చేరుకుంది. లీగ్‌ మ్యాచ్‌ లు పూర్తి అయ్యాయి. లీగ్‌ దశలో అద్బుత విజయాలను దక్కించుకున్న టీం ఇండియా పాయింట్ల పట్టికలో నెం.1 గా నిలిచి సెమీస్‌ కు దూసుకు వెళ్లింది. నెం.1 స్థానంలో ఉన్న టీం ఇండియా పాయింట్ల పట్టికలో నెం.4లో ఉన్న న్యూజిలాండ్‌ తో తలపడాల్సి ఉంది. లీగ్‌ దశలో అన్ని జట్లతో మ్యాచ్‌ లు ఆడిన టీం ఇండియా న్యూజిలాండ్‌ తో మాత్రం ఆడలేదు. న్యూజిలాండ్‌ తో మ్యాచ్‌ రోజు ఎడతెరపి లేకుండా వర్షం పడటంతో కనీసం టాస్‌ కూడా వేయకుండానే మ్యాచ్‌ ను క్యాన్సిల్‌ చేయడం జరిగింది.

ఆ మ్యాచ్‌ క్యాన్సిల్‌ అవ్వడంతో చెరో పాయింట్‌ దక్కింది. సిరీస్‌ ఆరంభంలో వర్షం చిరాకు పెట్టినా లీగ్‌ చివరికి వచ్చేప్పటి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా పోయిన వరుణుడు మంగళవారం జరిగబోతున్న మ్యాచ్‌ కు అంతరాయం కలిగించబోతున్నాడేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీం ఇండియా న్యూజిలాండ్‌ లు మొదటి సెమీ ఫైనల్‌ ఆడబోతున్న మాంచస్టర్‌ లో ప్రస్తుతం వాతావరణం బాగానే ఉన్నా మంగళవారం నాటికి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు.

మంగళవారం నాడు భారీ వర్షాలు కాకున్నా తేలికపాటి వర్షం అయినా పడటం ఖాయం అన్నట్లుగా తేలిపోయింది. వర్షం ఎక్కువ పడి మ్యాచ్‌ రద్దు అయితే రిజర్వ్‌ డే మ్యాచ్‌ ఆడించే అవకాశం ఉంది. అది ఎప్పుడు ఉండేది క్లీయర్‌ గా చెప్పలేం. కాని సెమీ ఫైనల్‌ కనుక చెరో పాయింట్‌ ఇచ్చేసి మ్యాచ్‌ ను రద్దు చేయడం కుదరదు. ఖచ్చితంగా మంగళవారం కాకున్నా మరే రోజైనా మ్యచ్‌ ను ఆడించాల్సిందే. టీం ఇండియా ఫేవరేట్‌ గా జరుగబోతున్న ఈ మొదటి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తారు మారు అయ్యే అవకాశం ఉందని కూడా కొందరు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం మాంచస్టర్‌ లో ఏం జరుగుతుందో చూద్దాం.