Begin typing your search above and press return to search.
భారత క్రికెట్ లో డబుల్ షాక్.. ధోని బాటలో రైనా రిటైర్మెంట్
By: Tupaki Desk | 15 Aug 2020 5:00 PM GMTభారత క్రికెట్ అభిమానులకు ఈరోజు డబుల్ షాక్ తగిలింది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ బాటలో మరో క్రికెటర్.. అతని స్నేహితుడు సురేష్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించడం పెను సంచలనమైంది.
టీమిండియాలో ఇద్దరు కీలక ఆటగాళ్లు ఒకేరోజు రిటైర్మైంట్ ప్రకటించడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇరువురి రిటైర్మైంట్ ప్రకటన వారి అభిమానులకు షాక్‌కి గురిచేసింది
ధోనీతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌నకి శనివారం హాజరైన సురేశ్ రైనా.. చివరిగా 2018లో భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో టీమిండియాలో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగిన సురేశ్ రైనా.. విరాట్ కోహ్లీ చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత జట్టుకి క్రమంగా దూరమైపోయాడు.
2005లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సురేశ్ రైనా.. 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లాడాడు. టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పేరొందిన సురేశ్ రైనా.. 2020 టీ20 వరల్డ్‌కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని ఆశించాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీ 2022కి వాయిదాపడిపోయింది. దాంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తానని ఇటీవల ధీమా వ్యక్తం చేసిన రైనా.. తన కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అదే బాటలో పయనించాడు. ధోనీకి రైనా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరూ కలిసే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి రిటైర్ మెంట్ ప్రకటన భారత క్రికెట్ అభిమానులను షాక్ కు గురిచేస్తోంది.