Begin typing your search above and press return to search.

రావణునికి రెయిన్ కోట్లు వేస్తున్నారు

By:  Tupaki Desk   |   8 Oct 2019 9:53 AM GMT
రావణునికి రెయిన్ కోట్లు వేస్తున్నారు
X
వర్షాలు వీడటం లేదు. ఇది తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. వాస్తవానికి వర్షాలు జూన్ మొదటి వారం నుంచి మొదలవుతాయి. కానీ.. ఈసారి అందుకు భిన్నంగా ఆగస్టు వరకూ అడ్రస్ లేదు. లేటుగా మొదలైన వర్షాలు.. లేటెస్ట్ అన్నట్లు తెగ టెన్షన్ పెట్టేస్తున్నాయి.వరుస పెట్టి కురుస్తున్న వర్షాలతో ఆగమాగమైపోతున్న పరిస్థితి.

హైదరాబాద్ మహానగరమైతే.. వరుస వర్షాల కారణంగా తడిచి ముద్ద కావటమే కాదు.. వాన చినుకు పడితే చాలు హైదరాబాదీయులు వణికిపోయే పరిస్థితి నెలకొంది.తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశంలోని మరిన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. మధ్యప్రదేశ్ లో ఇటీవల కురిసిన వర్షాలతో తెగ ఇబ్బంది పడుతున్నారు. దసరా ఉత్సవాల్ని భారీ ఎత్తున నిర్వహించే అక్కడి వారికి వర్షం.. వారి ఉత్సాహాన్ని నీరు కారుస్తోంది. దసరా సందర్భంగా రావణ దహన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున రావణుని బొమ్మల్ని ఏర్పాటు చేశారు.

వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో.. రావణ బొమ్మలకు భారీ రెయిన్ కోట్లను తయారు చేసి తొడిగేశారు.రావణ దహనం చేసే వేళలో.. ఆ కవర్లను తొలగించాలనుకుంటున్నారు. ఇక.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో అయితే.. ఏకంగా వాటర్ ఫ్రూప్ రావణుని బొమ్మల్ని తయారు చేశారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఊరికే అనలేదేమో?