Begin typing your search above and press return to search.
రైజర్స్ రైట్ రైట్..ప్లే ఆఫ్స్ రేసులో ముందంజ..
By: Tupaki Desk | 1 Nov 2020 6:50 AM GMTతప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ హైదరాబాద్ అదరగొట్టింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది. మ్యాచ్ ఆరంభానికి ముందు ఏడో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ బెంగళూరు పై విజయంతో ఒక్కసారిగా నాలుగో స్థానానికి చేరుకుంది. మరో వైపు వరుసగా మూడో మ్యాచ్ కూడా ఓడిపోయి బెంగళూరు చివరి మ్యాచ్ కు తప్పనిసరిగా గెలవాల్సిన స్థితికి చేరింది.
ఐపీఎల్లో శనివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది.ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులు చేసింది. ఫిలిప్ (31 బంతుల్లో 32; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. సందీప్ శర్మ తన రెండో ఓవర్ లోనే ఫామ్‌లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ (5)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అక్కడి నుంచి రాయల్ చాలెంజర్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సందీప్ తన మరుసటి ఓవర్లో కెప్టెన్ కోహ్లి (7)ని కూడా అవుట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 28/2 పరుగులే. ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్), మోరిస్ (3)) విఫలం అయ్యారు.గుర్‌కీరత్ (24 బంతుల్లో 15 నాటౌట్) గా నిలిచాడు. రైజర్స్ బౌలర్ల ధాటికి బెంగళూరు 120 పరుగులకే పరిమితం అయ్యింది.
అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 14.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలిచింది.
ఓపెనర్ వార్నర్ (8) రెండో ఓవర్లోనే అవుటవగా, మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా, (32 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్)వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వాషింగ్టన్ సుందర్ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు), మోరిస్ (3) ఉదన (0)ను ఔట్ అయినా చివర్లో జేసన్ హోల్డర్ (10 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్) మ్యాచ్ ని ముగించేశాడు. బెంగళూరును దెబ్బతీసిన సందీప్ శర్మ (2/20) కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
రైజర్స్ ప్లే ఆఫ్స్ రేస్ లోనే
బెంగళూరుపై విజయంతో ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో తాము కూడా ఉన్నామని సన్‌రైజర్స్ ఘనంగా చాటుకుంది. దీంతో 12 పాయింట్లతో చక్కటి రన్‌రేట్‌తో ఏకంగా ఏడు నుంచి నాలుగో స్థానానికి చేరిన ఈ జట్టు ఇక తమ చివరి మ్యాచ్‌ను కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అటు రెండో స్థానంలో ఉన్న బెంగళూరు అర్హత సాధించేందుకు ఢిల్లీతో జరిగే చివరి మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంది.