Begin typing your search above and press return to search.
హనుమంతుడు బీజేపీ లంకను కాల్చేస్తాడు..
By: Tupaki Desk | 25 Dec 2018 6:10 AM GMTరాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో ఇటీవల పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు దళితుండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనే కాదు.. కొందరు బీజేపీ నేతలు హనుమాన్ దళితుడంటూ చేస్తున్న అవాకులు, చెవాకులపై సంప్రదాయ వాదులు మండిపడుతున్నారు. దీనిపై బీజేపీని దుమ్మెత్తిపోస్తున్నారు.
తాజాగా ఈ వివాదంపై కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ చీఫ్ రాజ్ బబ్బర్ మండిపడ్డారు. హనుమంతుడు కేంద్రంగా బీజేపీ నేతలు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. హనుమంతుడికి కూడా కులం అంటగట్టి అభాసుపాలు చేస్తారా అంటూ మండిపడ్డారు.
బీజేపీకి చెందినే నేతలే హనుమంతుడి కులంపై రోజుకో మాట మాట్లాడుతున్నారని రాజ్ బబ్బర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ హనుమంతుడిని బ్రాహ్మణుడు అన్నాడని.. మరో ఎంపీ గిరిజనుడు అన్నాడని.. ఇంకో బీజేపీ ఎమ్మెల్సీ ముస్లిం అంటున్నారని మండిపడ్డారు. యూపీ మంత్రి అయితే జాట్ అంటూ పేర్కొన్నాడని తెలిపారు. హనుమంతుడిని అవమానించినందుకు ఇప్పటికే బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిందని.. ఇలా చేస్తే ఆ దేవుడు తన తోకతో బీజేపీని లంకలో కాల్చేస్తాడని రాజ్ బబ్బర్ హెచ్చరించారు..