Begin typing your search above and press return to search.

మునుగోడులో రేట్ ఫిక్స్ డ్.. ఇదే రేట్?

By:  Tupaki Desk   |   1 Sep 2022 5:30 AM GMT
మునుగోడులో రేట్ ఫిక్స్ డ్.. ఇదే రేట్?
X
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ జీవితంలోనే ఇదో అతిపెద్ద పరీక్ష ఇదీ. ఇందులో పాస్ అయితేనే రాజకీయంగా మనుగడ. లేకుంటే ఇక రాజకీయ జీవితం అంతమైనట్టే.. అన్న వెంకటరెడ్డిని కాదని.. పెంచిపోషించిన కాంగ్రెస్ ను కాలదన్ని మరీ.. బీజేపీ అండ చూసుకొని బయటకొచ్చి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు ముందుంది ముసళ్ల పండుగ అంటున్నారు.

అన్న వెంకటరెడ్డి మద్దతు ఇస్తున్నారో లేదో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ లోనే ఉండి బీజేపీలో ఉన్న తమ్ముడిని ఆయన గెలిపించడం కష్టమే. అటు కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేయరు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇన్నాళ్లు అన్న చాటు తమ్ముడిగా రాజకీయం చేశాడు. ఇప్పుడు ఒంటరిగా ఎదురీదుతున్నాడు.

అందుకే ఎన్నికల ప్రకటన రాకముందే సర్దుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎలక్షన్ కోడ్ వస్తే టీఆర్ఎస్ సర్కార్ తన ప్రభుత్వ బలంతో అక్కడ ఏదైనా రాజకీయం చేయగలదు. రాజగోపాల్ రెడ్డి డబ్బు పంపిణీ సహా నేతలను లాగే పనిని అడ్డుకోగలదు. అందుకే ఇవేవీ రాకముందే క్షేత్రస్థాయిలో ఉన్న నేతలను తనవైపు తిప్పుకునేందుకు అడుగులు వేస్తున్నారు.

ఈ క్రమంలోనే వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ, సర్పంచ్ ల వరకూ లెక్కబెట్టి మరీ మునుగోడులో బీజేపీ అభ్యర్థి రేట్ ఫిక్స్ చేశారంట.. వార్డ్ మెంబర్ కి 2 లక్షలు, సర్పంచ్ కు రూ.10-15 లక్షలు, ఇలా రేట్ పెట్టి కొనుక్కుంటున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

రాజగోపాల్ రెడ్డి గెలవలేకపోతే మొత్తం వాళ్ల రాజకీయ జీవితం మునుగుతుందని కంగారుపడుతున్నారు.. ఈటల రాజేందర్ ఫార్ములాను వాడుకుతున్నాడట.. ఎన్నికల టైంలో ఈటల రాజేందర్ పంచాల్సిన డబ్బులు, వస్తువులను అప్పుడు హుజూరాబాద్లో టీఆర్ఎస్ పోలీసుల చేత స్వాధీనం చేసుకొని షాక్ ఇచ్చింది. అందుకే ముందుగానే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడే పంచుడు స్ట్రాట్ చేశాడని అంటున్నారు.

ఇక నేతలు కూడా ముందే సుదులాయించుకుంటున్నారు. ఎన్నికల్లో టైమ్ కి టీఆర్ఎస్ ఏం చేస్తుందో? కేసులు పెడుతారేమో.. ముందుగా అయితే డబ్బులు తీసుకుందాం అని పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని బీజేపీ కండువా కప్పుకుంటున్నారట.. ఇలా రాజగోపాల్ రెడ్డి పంచడాలు.. నేతలు తమ రేట్ ఫిక్స్ చేసుకొని అందని కాడికి క్యాష్ చేసుకోవడాలు జరిగిపోయాయి.

మునుగోడులో నేతలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వారు ప్రస్తుతానికి అభివృద్ధి కోణంలో టీఆర్ఎస్ పంచన చేరారు. చాలా మంది గులాబీ పార్టీ కిందే పనిచేస్తున్నారు. వారికి రేట్ ఫిక్స్ చేసి మరీ రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పేస్తున్నారు. ఇక డబ్బులే ప్రధానం కావడంతో తామ ఆర్థిక అవసరాల కోసం నేతలు కూడా ఎవరు ఎక్కువిస్తే అటే మారిపోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.