Begin typing your search above and press return to search.
పాక్ లోని రాజ్ కఫూర్ హవేలీని కూల్చేశారు
By: Tupaki Desk | 18 Jan 2016 4:49 AM GMTప్రఖ్యాత బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ పూర్వీకులకు చెందిన హవేలీని పాక్షికంగా కూల్చేశారు. అయితే.. కూల్చివేత విషయాన్ని తెలుసుకున్న పాక్ అధికారులు వెనువెంటనే స్పందించి.. పూర్తిగా కూల్చివేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాజ్ కపూర్ మూలాలు పాక్ లోని ఖైబర్ ఫక్లూన్ వాలా రాష్ట్రంలో ఉన్నాయి. రాజ్ కపూర్ తో పాటు.. దిలీప్ కుమార్ పూర్వీకుల ఇళ్లు అక్కడే ఉన్నాయి. రాజ్ కపూర్ తండ్రి పృథ్వీరాజ్ కపూర్ 1920లో పెషావర్ లో ఈ హవేలీని నిర్మించినట్లు చెబుతారు. విభజన సమయంలో భారత్ కు వచ్చేసినప్పటికీ.. వారి హవేలీలను చారిత్రక సంపదగా గుర్తించిన పాక్ సర్కారు వాటిని సంరక్షిస్తోంది.
అయితే.. రాజ్ కపూర్ ఇంటి యజమాని మాత్రం సదరు హవేలీని కూల్చేసి.. ఆ స్థానంలో పెద్ద భవంతి కట్టాలని నిర్ణయం తీసుకొని.. ఇంటి మొదటి మూడు అంతస్తుల్లోని కిటికీలు.. తలుపుల్ని తొలగించారు. నిజానికి ఈ ఇంటిని పురాతత్వ శాఖ అధికారులు ఎలాంటి కూల్చివేతలకు గురికాకుండా ఉండేలా కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకున్నారు. అయితే.. సమాచార లోపంతో కూల్చివేత ఘటన చోటు చేసుకోవటంతో అక్కడి అధికారులు వెనువెంటనే స్పందించారు. అయితే.. తాజా కూల్చివేతపై రిషీకపూర్ స్పందిస్తూ.. తమకు ఆ భవనంత ఎలాంటి సంబంధం లేదని.. తాను ఇప్పటివరకూ ఆ ఇంటిని చూడలేదని.. దాన్నేం చేసుకుంటారో వారి ఇష్టంగా వ్యాఖ్యానించటం గమనార్హం.