Begin typing your search above and press return to search.
రాజమండ్రి ఎయిర్ పోర్టుకు మహర్దశ
By: Tupaki Desk | 14 Jan 2019 9:09 AM GMTఆంధ్రప్రదేశ్ కు మరో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో రానుంది. రాజమండ్రి ఎయిర్ పోర్టు విస్తరణ పనులు ఆదివారం పూర్తి అయ్యాయి. మరో రెండు, మూడు నెలల్లోనే రాజమండ్రి ఎయిర్ పోర్టు అమలులోకి రానుంది. ఇక అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు వీలుగా రన్ వేను 3165 మీటర్లకు విస్తరించారు.
ప్రస్తుతం రాజమండ్రికి 16 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. రాజమండ్రి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సర్వీసులు నడుస్తున్నాయి. విస్తరణ పూర్తై అమల్లోకి వస్తే ముంబై, తిరుపతి, ఢిల్లీ ప్రాంతాలకు విమానాలు నడుస్తాయి. ప్రస్తుతం రోజుకు 1200 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఏడాది 3.5 లక్షల మంది ప్రయాణించారు.
ఎయిర్ పోర్టు డైరెక్టర్ రాజ్ కిషోర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నెలకు 40వేల మంది ప్రయాణిస్తున్నారని.. మార్చినాటికి 5 లక్షలకు చేరుకుంటుందని తెలిపారు. రాజమండ్రి విమానాశ్రయానికి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. రాజమండ్రిలో రిలయన్స్ వంటి సంస్థలు - పోర్ట్ లు - ఓఎన్జీసీ - వ్యాపార సంస్థల వల్ల డిమాండ్ ఏర్పడిందన్నారు. కార్గొ సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు.
రాజమండ్రి చార్ట్ లను అంతర్జాతీయం చేస్తామని.. ఇక్కడి విమానాశ్రయ సౌకర్యాలు లండన్ విమానాశ్రయంలో ఉన్నా కూడా తెలుసుకోవచ్చని ఎయిర్ పోర్టు డైరెక్టర్ రాజ్ కిషోర్ తెలిపారు. ఈ చార్ట్ లో రన్ వే, సేఫ్టీ, అప్రాన్, టెర్నినల్స్, పార్కింగ్, కార్గో ఇతర సౌకర్యాల వివరాలన్నీ ఉంటాయి. ఇవన్నింటితోనే పెద్ద విమానాలకు అనుమతిస్తారు. ఈ సర్వే చార్ట్ పూర్తయ్యింది. దీంతో పెద్ద విమానాలు దిగడానికి ఆస్కారం లభించనుంది.
రాజమండ్రిలో ఇన్నాళ్లు కేవలం 1750 మీటర్ల రన్ వే మాత్రమే అందుబాటులో ఉండేది. దీన్ని ఇప్పుడు 3165 మీటర్లకు, వెడల్పు 45 మీటర్లకు విస్తరిస్తారు. 181 కోట్లతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.కొత్తగా 852 ఎకరాలు సేకరించి అభివృద్ధి చేశారు. రన్ వే నిర్మాణం కోసం తొమ్మిది నెలల్లోనే పని పూర్తి చేయించడం విశేషం. రన్ వే పూర్తయినప్పటికీ సేఫ్టీ విషయంలో అనుమతి లభించాల్సి ఉంది. కార్టోగ్రఫీ సర్వే లో సమీప చెట్లు, భవనాలు తొలగించాలని రెవెన్యూ శాఖను సమాయత్తమవుతోంది. వచ్చే రెండేళ్లలోనే రాజమండ్రి విమానాశ్రయం పెద్దగా అభివృద్ధి చెందిందని ఎయిర్ పోర్టు డైరెక్టర్ రాజ్ కిషోర్ తెలిపారు. సీ17 వంటి పెద్ద విమానాలు కూడా ఇక్కడ దిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఎక్కువ మోతాదులో ఆహారపదార్థాలు దిగుమతికి కూడా ఇక్కడ ఏర్పాట్లున్నాయి.
రాజమండ్రిలో ఎయిర్ బ్రిడ్జిలు నిర్మిస్తామని బస్సులోనే ప్రయాణికులు విమానం వద్దకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామని.. ఆ తర్వాత నేరుగా విమానం వద్దకు వెళ్లేలా తీర్చిదిద్దుతామని ఎయిర్ పోర్టు డైరెక్టర్ రాజ్ కిషోర్ తెలిపారు.