Begin typing your search above and press return to search.
రాజ్ కుంద్రా చీకటి వ్యవహారాలు.. షాకింగ్ విషయాలు?
By: Tupaki Desk | 22 July 2021 9:04 AM GMTబిజినెస్ మెన్ రాజ్ కుంద్రా అనే కంటే సినిమా నటి శిల్పా శెట్టి భర్త అంటేనే మన తెలుగు ప్రజలకి తొందరగా తెలిస్తుంది. రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత, ఇతని చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నగ్న వీడియోలు తయారు చేయడం, వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం వంటి అభియోగాలు రాజ్ కుంద్రాపై మోపబడ్డాయి.
గత ఏడాది ఇది ఫిబ్రవరి 4వ తేదీన మహిళలను బలవంతంగా శృంగార సినిమాల్లోకి నెట్టిన ఆరోపణలపై ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ ప్రారంభించిన మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు పోర్న్ చిత్రాల వ్యాపార రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. బ్రిటన్ వేదికగా నడుస్తున్న యుకె ప్రొడక్షన్ అధిపతి ఉమేష్ కామత్ తో రాజ్ కుంద్రా కు సంబంధాలున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సినిమాల్లో, టెలివిజన్లలో నటించేందుకు ఉత్సాహం చూపించే మోడల్స్, అమ్మాయిలను వీరు టార్గెట్ చేస్తారు. వెబ్ సిరీస్, ఇతర షూటింగులు జరుపుతున్నట్లు నమ్మించి చివరి క్షణంలో స్క్రిప్ట్ మార్చేస్తారని పోలీసులు చెబుతున్నారు. ముంబై శివార్లలో షూటింగ్ చేసిన అనంతరం శృంగార వీడియోలను సోషల్ మీడియాలో ఉంచుతారు. సదరు వీడియోలను మన దేశం లో ప్రసారం చేయడం నేరం కాబట్టి బయట దేశాల్లోని సర్వర్ల ద్వారా హాట్ షాట్ అనే యాప్ లోకి అప్లోడ్ చేస్తున్నారు. లాక్ డౌన్లో పుణ్యమా అని సదరు యాప్ లోకి వివరాలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చేరారు. వీరు నుంచి చి డబ్బులు వసూలు చేసి వాటి ప్రసారాలను అందజేస్తారు. ఈ నెల 19వ తేదీన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు.
మన దేశంలో ప్రసారమవుతున్న ఛానళ్లపై, సోషల్ మీడియాపై టెలికం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ట్రాయ్ గట్టి నిఘా పెడుతుంది. అశ్లీల కంటెంట్ ప్రసారం చేసినా, నిర్మించినా కఠిన నిర్ణయాలు ఉంటాయి. ఐటీ యాక్ట్ ప్రకారం జైలు అనుభవించాల్సి ఉంటుంది. రాజ్ కుంద్రాపై ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 354C, 292, 293, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మహిళలు అశ్లీల చిత్రాల్లో నటించేందుకు బలవంతంగా ప్రేరేపించడంపైనా కేసులు నమోదు చేయబడ్డాయి.
రాజ్ కుంద్ర అరెస్టు వ్యవహారం బాలీవుడ్ పెద్ద దుమారమే రేపుతుంది. సోని టీవీలో ప్రసారమయ్యే టీవీ రియాలిటీ షో సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4 నుంచి నటి శిల్పా శెట్టి దూరమైంది. మరోపక్క పోలీసులు రాజ్ కుంద్రాా ఆస్తులు, లావాదేవీల వ్యవహారాలన్నింటిని ఆరా తీస్తున్నారు. కేసును బిగించేందుకు గల అవకాశాలన్నింటిపై ద్రుష్టి పెట్టారు. రాజ్ కుంద్రాాపై 2013లొ క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు పలు ఆరోపణలు వచ్చాయి.
సినిమా ఇండస్ట్రీలో లైంగిక హింసపై మీటూ ఉద్యమం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది నటీమణులు తమ గొంతుకను వినిపించారు. ఆరోపణలు ఎదుర్కొన్నవారి లో చాలా మంది పెద్ద నటులు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఉన్నారు. ఇప్పుడు రాజ్ కుంద్రా వంటి పెద్ద మనుషులు ఎదుర్కొంటున్న ఆరోపణలు కూడా అలాంటివే. చట్టాల్లోని లొసుగులను అడ్డుపెట్టుకొని ఇటువంటి వారంతా తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. మొత్తానికి రాజ్ కుంద్రా వ్యవహారం ఓ అధ్యాయానికి ముగింపు పలుకుతుందో లేదో వేచి చూడాల్సిందే.