Begin typing your search above and press return to search.
శ్రీదేవి అంత్యక్రియలపై సంచలన ఆరోపణలు
By: Tupaki Desk | 19 March 2018 6:43 AM GMTసంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే మరోసారి తనదైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మరణించిన శ్రీదేవి అంత్యక్రియలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపేలా ఉన్నాయి. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
శ్రీదేవి అంత్యక్రియల్ని నిర్వహించిన తీరును తీవ్రంగా తప్పు పట్టిన రాజ్ ఠాక్రే.. మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ముంబయిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిట్లర్ పాలనను తలపించేలా మోడీ పాలన మారిందన్నారు.
నీరవ్ మోడీ కుంభకోణం నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకే శ్రీదేవి అంత్యక్రియల విషయంలో ప్రభుత్వం అనవసర హడావుడి చేసిందన్నారు. శ్రీదేవి గొప్ప నటి కావొచ్చని.. ఆమె దేశానికి ఏం సేవ చేశారని ప్రశ్నించారు. ఆమె భౌతికాయంపై త్రివర్ణ పతాకాన్ని కప్పాల్సిన అవసరం ఏమిటన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఏముందన్న ఆయన.. బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఎవరైనా ఇదే పని చేసి ఉంటే మీడియా గగ్గోలు పెట్టేదన్నారు. మోడీ ప్రభుత్వానికి మీడియా భయపడి నోరు తెరవపటం లేదన్నారు. శ్రీదేవి మీద విమర్శలు చేసిన ఆయన.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మీద విమర్శనాస్త్రాల్ని సంధించారు. అక్షయ్ భారతీయుడు కాదని.. ఆయన పాస్ పోర్ట్ లో కెనడియన్ గా ఉందని.. వికీలోనూ ఆయన భారత్ లో పుట్టిన కెనడియన్ గా ఉందని చెప్పారు. రాజ్ ఠాక్రే చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.