Begin typing your search above and press return to search.
రాజ్ ఠాక్రే వాదనలో లాజిక్కును కాదనలేం!
By: Tupaki Desk | 2 Oct 2016 4:37 AM GMTపాక్ తో ఉన్న పంచాయితీ వేరు. పాక్ కు చెందిన కళాకారులు వేరు. పాక్ సర్కారుతో విభేదాలు ఉంటే.. వారితో తేల్చుకోవాలే కానీ.. పాకిస్థాన్ కళాకారుల్ని వెనక్కి వెళ్లిపోమని చెప్పటం ఏమిటి? వారికేం సంబంధం ఉంది? మన ఆగ్రహం పాక్ ప్రభుత్వం మీదనే కానీ.. పాక్ ప్రజల మీద కాదు కదా? అంటూ కొందరు చేస్తున్న వాదన వినేందుకు బాగుంటుంది. కానీ.. లాజిక్కుగా చూస్తే.. ఇందులో డొల్లతనం ఇట్టే కనిపిస్తుంది.
పాక్ దేశంతోనే పాకిస్థానీయులు మమేకం అయి ఉంటారే తప్పించి.. పాక్ ప్రభుత్వం వేరు.. పాకిస్థానీయులు వేరు కాదన్న వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేయటమే కాదు.. చిత్రమైన వాదనను తెరపైకి తీసుకొస్తున్న కొందరి ప్రముఖుల్ని తాజాగా టార్గెట్ చేశారు రాజ్ ఠాక్రే. బాలీవుడ్ కండల వీరు సల్మాన్ ఖాన్ సైతం పాక్ కళాకారుల్ని వ్యతిరేకించటం ఏమిటంటూ చేసిన వ్యాఖ్యలపై రాజ్ ఠాక్రే తాజాగా రియాక్ట్ అయ్యారు.
కేవలం ఆవేశంతోనే కాదు.. లాజిక్ తో మాట్లాడిన ఆయన మాటలు విన్నప్పుడు నిజమేకదా? అన్నభావన కలగటం ఖాయం. ‘‘పాకిస్థానీ నటుల బహిష్కరణను వ్యతిరేకిస్తున్న సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లంతా పాకిస్థాన్ వెళ్లి అక్కడి సినిమాల్లో నటించండి. సల్మాన్ ఖాన్ కి సినిమాలో బుల్లెట్లు తగిలితే లేచి నిలబడతాడు. కానీ.. మన సైనికులు ఎదుర్కొంటున్నవి సినిమా బుల్లెట్లు కావు. అసలైన బుల్లెట్లు. మన సైనికులకు పాక్ జవాన్లతో ఎలాంటి శత్రుత్వం లేదు. అయినా ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నారు. నేనూ కళాకారుడినే. కళాకారులు ఆకాశం నుంచి ఊడిపడలేదు. పాక్ కళాకారులు ఉరీ ఘటనను ఖండించలేదు. వారిని మనవాళ్లు ఎలా సమర్థిస్తారు?’’ అని ఏ ప్రశ్నను అడగాలో అదే ప్రశ్నను అడిగేశారు.
అంతటితో ఆగని ఠాక్రే.. ‘‘దేశంలో ప్రతిభ కలిగిన కళాకారులకు కొరత వచ్చిందా? కరవు ఏమైనా ఉందా?మన సైనికులు గులాం ఆలీ కచేరిని వినటానికి ఆయుధాలు పక్కనబెడితే ఏం జరుగుతుంది?’’ అంటూ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పటం కష్టమే. మరి.. ఇలాంటి సందేహాలు సల్మాన్ ఖాన్ అండ్ కో లాంటోళ్లకు ఎందుకు రావు..? అసలు వారికి భారత సైనికుల త్యాగాలు ఎలా కనిపిస్తాయి?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/