Begin typing your search above and press return to search.
హిట్లర్ లా ప్రవర్తిస్తున్న కేసీఆర్..!!
By: Tupaki Desk | 16 Oct 2019 6:57 AM GMTతెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరును హిట్లర్ ను తలపిస్తోందని తెలంగాణలో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ లో నిప్పులు చెరిగారు. తెలంగాణలో కేసీఆర్ హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నారని.. చివరకు హిట్లర్ కు ఏమీ జరిగిందో.. కేసీఆర్ కు అలాగే జరుగుతుందని.. ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి.. హైదరాబాద్ పరిధిలోని రాణిగంజ్ లో సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్య తనను కలిచివేసిందని రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఎంఐఎం సోదరులు అసద్, అక్బర్ లను ఉద్దేశించి రాజాసింగ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో 50వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించి వారితో కనీసం చర్చించడానికి కూడా మీరు మద్దతిస్తున్న కేసీఆర్ సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని.. ముస్లింల హక్కుల కోసం పోరాడే ఓవైసీ బ్రదర్స్ దీనిపై ఎందుకు స్పందించరంటూ రాజాసింగ్ ఫైర్ అయ్యారు.
తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఉబలాటపడుతున్న భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఆర్టీసీ సమ్మె అందివచ్చిన అవకాశంగా మారింది. కేసీఆర్ పై పోరాడడానికి బలం పెంచుకోవడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక గవర్నర్ తమిళిసై కూడా తెలంగాణలో కేసీఆర్ దూకుడు.. పరిస్థితులపై తాజాగా కేంద్రానికి నివేదిక అందజేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కేసీఆర్ సర్కారుపై దూకుడు పెంచేశారు. రాజాసింగ్ అయితే కేసీఆర్ ను ‘హిట్లర్’ తో పోల్చడం చర్చనీయాంశంగా మారింది.