Begin typing your search above and press return to search.

బీజేపీ అభ్యర్థిపై 47 కేసులు.. 3.07కోట్లు

By:  Tupaki Desk   |   13 Nov 2018 9:11 AM GMT
బీజేపీ అభ్యర్థిపై 47 కేసులు.. 3.07కోట్లు
X
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును ‘భాగ్యనగరం’ గా మారుస్తామని బీజేపీ గోషామహల్ తాజామాజీ ఎమ్మెల్యే టీ. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.. హిందుత్వ సెంటిమెంట్ ను రగిల్చి గడిచిన సారి ఎన్నికల్లో గెలిచిన రాజాసింగ్ మరోసారి ఈ ఎన్నికల్లోనూ అదే ఫార్ములాను అప్లై చేస్తున్నాడని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

తెలంగాణ శాసన సభ ఎన్నికల కోసం నోటీఫికేషన్ శుక్రవారం విడుదలైంది. తాజాగా టీ. రాజాసింగ్ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తులు - కేసుల వివరాలను ప్రకటించారు.

ఎన్నికల కమిషన్ కు టి. రాజాసింగ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనపై 43 కేసులు ఉన్నాయని.. మొత్తం ఆస్తుల విలువ రూ.3.07 కోట్లు అని తెలిపాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్రెటేరియట్ బ్రాంచ్ లో 55.99 లక్షల విలువైన డిపాజిట్లు - 25.47 లక్షల విలువైన మూడు వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. అతని భార్య ఉషారాణి పేరు మీద బంగారు ఆభరణాలు రూ.9.6లక్షలు - 4.68 లక్షల రూపాయిల స్థిర డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు.

2014 ఎన్నికల్లో టీ రాజాసింగ్ 30వేల మెజార్టీతో గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. టీడీపీ మద్దతుతో ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున నిలబడి గెలిచాడు. ఈసారి బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. మద్దతిచ్చిన టీడీపీ కాంగ్రెస్ తో కలిసింది. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ - కాంగ్రెస్ - బీజేపీల మధ్య ఈ సీటు కోసం బిగ్ ఫైట్ తప్పేలా లేదు.