Begin typing your search above and press return to search.
కత్తి మహేష్ పై పోలీస్ కేసు ?
By: Tupaki Desk | 9 Dec 2017 8:30 AM GMTఅవును ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అటు జనసేన అధినతే పవన్ కళ్యాణ్‌ను తరచుగా విమర్శిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఆయన్ను కటకటలపాలు చేస్తారా? ఈయన విషయంలో సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఫిర్యాదు చేయడం, దానికి పోలీసులు స్పందించడం చూస్తుంటే...ఇలాంటి సందేహమే కలుగుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే....టాలీవుడ్ సినీ విమర్శకుడు మహేష్ కత్తి.
ఇటీవలి కాలంలో జనసేన పార్టీపై - పవన్ పై మహేష్ కత్తి విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే రీతిలో తాజాగా పవన్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇటీవల టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల పై పవన్ పరోక్షంగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇలా పవన్ స్పందించిన అంశాలపై మహేష్ కత్తి ఓ ట్వీట్ లో ఘాటుగా రియాక్టయ్యాడు. `ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నరహంతకులకు సపోర్ట్ ఇచ్చిన నిన్ను.. మతోన్మాదులతో చెయ్యి కలపొద్దు అని చెప్పిన నీ అభిమాని నీకు చెడ్డోడులా కనిపించాడా? మోడీ ప్రధాని అయినంత మాత్రానా ఏం చేసినా రైట్ అయిపోతుందా?.. నీ ఉన్నాదం ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతూనే ఉంది` అని మహేష్ కత్తి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కత్తి మహేష్ చేసిన ట్వీట్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ స్పందించారు. ఓ ట్వీట్లో ఆయన రియాక్టవడమే కాకుండా...అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. `ఛీప్ పబ్లిసిటీతో ఫేమస్ అవడం కోసం దేశ ప్రధాని పై ఆరోపణలు చేయడం తగదు. మహేశ్ కత్తి పై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ లను కోరుతున్నాను` అని ట్వీట్ చేశారు. కాగా, ఈ ట్వీట్ కు హైదరాబాద్ సిటీ పోలీస్ స్పందించారు. `మహేష్ కత్తిపై చర్యల నిమిత్తం సంబంధింత అధికారికి మేము వివరిస్తాం` అని చెప్పారు. ఓవైపు ఎమ్మెల్యే ఫిర్యాదు...మరోవైపు పోలీసుల స్పందన నేపథ్యంలో మహేష్ కత్తిని అరెస్ట్ చేస్తారా అనే చర్చ పలువురిలో సాగుతోంది.