Begin typing your search above and press return to search.

5 మినిట్స్ టైమిస్తే..అక్బరుద్దీన్ చేత ఆ మాట అనిపిస్తాడట!

By:  Tupaki Desk   |   1 Aug 2019 4:50 AM GMT
5 మినిట్స్ టైమిస్తే..అక్బరుద్దీన్ చేత ఆ మాట అనిపిస్తాడట!
X
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. తన రాజకీయ ప్రత్యర్థులకు మంట పుట్టేలా వ్యాఖ్యలు చేసే విషయంలో వెనక్కి తగ్గని ఆయన.. దూకుడు రాజకీయాలకు సుపరిచితుడిగా చెప్పక తప్పదు. అధికారపక్షంతో ఉండే స్నేహంతో చెలరేగిపోయే అక్బరుద్దీన్ ఇటీవల కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

పావుగంట టైమిస్తే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల కలకలం రేపిన వైనం తెలిసిందే. గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాతాపం లేని రీతిలో. . తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు బరితెగింపుగా పలువురు అభివర్ణిస్తున్నారు. రెచ్చగొట్టే మాటలకు చెక్ చెప్పేలా ఇప్పటికే పలువురు పోలీసు కంప్లైంట్స్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. అక్బరుద్దీన్ పదిహేను నిమిషాల మాటలకు ఆయన తరహాలోనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్.

తాజాగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అక్బరుద్దీన్ చేసిన పావుగంట మాటల్ని ప్రస్తావిస్తూ.. అక్బరుద్దీన్ తనకు పదిహేను నిమిషాలు టైమివ్వాలన్నారు. ఎప్పుడైనా.. ఎక్కడైనా తాను సిద్ధమన్నారు. తనకు పావు గంట టైమిస్తే.. ఐదు నిమిషాల వ్యవధిలో అక్బరుద్దీన్ చేత భారత్ మాతాకీ జై అన్న నినాదాన్ని చేయిస్తానన్నారు. వందేమాతరం గీతం పాడిస్తానని చెప్పారు. అయినా.. భారతదేశంలో పుట్టి.. పెరిగి.. ఇక్కడే జీవిస్తున్న ప్రతి ఒక్కరూ తన తల్లికి జై కొట్టేందుకు వెనుకాడటం ఏమిటో? ప్రపంచంలో మరే దేశంలోనూ ఇలాంటి పరిస్థితి ఉండదేమో? ఏది ఏమైనా రాజాసింగ్ వ్యాఖ్యలకు ఫైర్ బ్రాండ్ అక్బరుద్దీర్ మరెంత వివాదాస్పదంగా రియాక్ట్ అవుతారో చూడాలి.