Begin typing your search above and press return to search.

మోడీ చీపా.? నువ్వొక జోకర్ కేసీఆర్

By:  Tupaki Desk   |   9 April 2019 10:53 AM GMT
మోడీ చీపా.? నువ్వొక జోకర్ కేసీఆర్
X
ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా పోటీపోటీ ఆరోపణలతో నేతలు హోరెత్తిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన కామెంట్లతో హోరెత్తించారు బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. నిజామాబాద్ పార్లమెంటరీ స్థానంలో బీజేపీ తరుఫున పోటీచేస్తున్న అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న రాజాసింగ్ తాజాగా కేసీఆర్ పై పదునైన విమర్శలతో హోరెత్తించారు.

ఇటీవల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీని చీప్ ప్రధాని అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు రాజాసింగ్. రాత్రి కొబ్బరి నీళ్లు తాగే కేసీఆర్.. తెల్లారేసరికి ఏం మాట్లాడుతారో తెలియదని రాజాసింగ్ సంచలన కామెంట్ చేశారు. కాంగ్రెస్ లో ఒక్క జోకర్ ఉంటే.. టీఆర్ఎస్ లో పెద్ద జోకర్ కేసీఆర్ తయారైండని చురకలంటించారు. కేసీఆర్ ఒక్క మాట మాట్లాడినా మీడియాలో పెద్ద జోక్ అవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరిని గౌరవించాలి.. ఎవరిని తిట్టాలనే దానిపై కేసీఆర్ నియంత్రణ లేదన్నారు. కేసీఆర్ ను చూస్తే కొంచెం మెంటల్లీ డిస్ట్రబ్ అయినట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

రాత్రిపూట కొబ్బరి నీళ్లు తాగాకా మంచిగా ఆలోచిస్తే చీప్ ఎవరో మీకే అర్థమవుతుందని రాజాసింగ్ చురకలు అంటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కవితను ఓడించి బీజేపీ అభ్యర్థి అరవింద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని రాజా సింగ్ కోరారు.

నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ కూతురు కవిత పోటీచేస్తోంది. కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ పోటీచేస్తున్నారు. పైగా ఇక్కడ 178మంది రైతులు నామినేషన్ వేసి దేశవ్యాప్తంగా దీంతో ఇక్కడి ఎన్నికలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ గందరగోళంలో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.