Begin typing your search above and press return to search.

చంపేందుకు..చ‌చ్చేందుకైనా రెడీ:ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   12 Aug 2018 10:02 AM GMT
చంపేందుకు..చ‌చ్చేందుకైనా రెడీ:ఎమ్మెల్యే
X

బీజేపీ ఫైర్‌ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బ‌క్రీద్ సంద‌ర్భంగా జ‌రిగే ప‌రిణామాల నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న సోమజిగూడా ప్రెస్ క్ల‌బ్‌లో మీడియాతో మాట్లాడుతూ క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు గో రవాణాను అరికట్టాయ‌ని అయితే - తెలంగాణ వచ్చాక టీఆర్ ఎస్ ప్రభుత్వంలో గోవులను బహిరంగంగా ఊచ‌కోత కోస్తున్నార‌ని రాజాసింగ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అక్రమ గో కోతలు జరుగుతున్నాయని పేర్కొంటూ వాటిని అపడంలో టీఆర్ ఎస్ వైఫల్యం చెందిందని మండిప‌డ్డారు. వాహనానికి వెయ్యి రూపాయ‌లు లంచంగా తీసుకొని గో అక్రమ రవాణాను పోలీసులు ప్రోత్సహిస్తున్నారని మండిప‌డ్డారు.

సీఎం కేసీఆర్ ఎంఐఎం పార్టీ చేతిలో కీలుబొమ్మలా మారిపోయార‌ని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. కారు కేసీఆర్‌ది అయితే స్టీరింగ్ మాత్రం ఎంఐఎం పార్టీదని ఆయ‌న అన్నారు. ``అక్రమ గో కోతల పట్ల పోలీస్ అధికారులు ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు? బక్రీద్‌ పండుగ సందర్భంగా గో అక్రమ రవాణా జరుగుతున్న ఎందుకు బారికేడ్లు - చెక్‌ పోస్ట్‌ లను ఏర్పాటు చేయలేదు? మతపరమైన ఘర్షణలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్‌లపై ఉంది. ఎన్‌ జీఓల‌తో సీపీ ఇంతవరకు మీటింగ్ ఎందుకు పెట్టలేదు?`` అని రాజాసింగ్ ప్ర‌శ్నించారు. తాము గోర‌క్షణ వాదులమ‌ని - ఎలాంటి ఘర్షణలు జరగవద్దు అనేదే త‌మ ఉద్దేశమ‌న్నారు. అన్ని పండుగలు సంతోషంగా జరగాలని కోరారు. గో అక్రమ రవాణా జరుగుతుంటే రవాణా శాఖ మంత్రి ఎం చేస్తున్నారని ప్ర‌శ్నించారు.

బ‌క్రీద్‌ కి కోసం పాతబస్తీలో 3000 ఆవులు ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్నాయి,వెంటనే దీనిని అరికట్టాల‌ని రాజాసింగ్ కోరారు. బక్రీద్‌ కు అల్లర్లు కాకుండా చూసుకోవాల‌ని - ఆవులను చంపి మనోభావాలు దెబ్బతిస్తే ఊరుకోబోమ‌ని - దేనికైనా రెడీ అని రాజాసింగ్ ప్ర‌క‌టించారు. సోమవారం నుండి గో రక్షణ కోసం స్వయంగా తామే రంగంలోకి దిగుతామ‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు. అక్రమ గో రవాణాను ప్రభుత్వం అపకపోతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామ‌ని తెలిపారు. అవుకోసం ప్రాణం తీయడానికి - ఇయ్యడానికైనా తాము సిద్ధంగా ఉన్నామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆవుకు ఉన్న విలువ ఎద్దుకు ఉందని సీఎం కేసీఆర్ తెలుసుకోవాల‌ని రాజాసింగ్ కోరారు.