Begin typing your search above and press return to search.
పవన్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్..ఏమైందంటే?
By: Tupaki Desk | 3 Dec 2019 5:54 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయంగా ఫుల్ బిజీగా మారారు. ఎన్నికలు అయిపోయిన తరువాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్న పవన్ మళ్లీ పార్టీ ని పటిష్టం చేయడానికి జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి అందరికి తెలిసిందే. ఒక్కసారి స్టేజ్ ఎక్కి మైక్ తీసుకున్నాడు అంటే ..మైక్ ఇచ్చేవరకు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఊగిపోతూ ఏదేదో మాట్లాడతారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ మతం పై చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ సోమవారం తిరుపతిలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అని , మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని ఆరోపించారు. అలాగే ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని అన్నారు. అలాగే టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది హిందువులేనని ఆరోపించారు. హిందూ నాయకుల ప్రేరణ లేనిదే ఇలాంటివి జరగవని , తాను చిన్నప్పటి నుంచి వింటోంది ఒకటేనని..సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతోంది హిందూవులు మాత్రమేనని చెప్పారు. కాగా, పవన్ హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. పలువర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
దీనిపై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. హిందూమతం, హిందూ ధర్మం గురించి కనీస అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? అంటూ ప్రశ్నించారు. హిందూ మతాన్ని టార్గెట్‌గా చేసిన మట్లాడం సరైనది కాదని. పవన్ హిందూ మతం పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఖబర్దార్ పవన్ అంటూ హెచ్చరించారు.