Begin typing your search above and press return to search.

రాజాసింగ్ తగ్గేదే లేదు..ఎంబసీకి షాకింగ్ కౌంటర్

By:  Tupaki Desk   |   11 April 2020 3:30 PM GMT
రాజాసింగ్ తగ్గేదే లేదు..ఎంబసీకి షాకింగ్ కౌంటర్
X
నిజమే... ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలోని గోషా మహల్ అసెంబ్లీ నియోజవకర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బీజేపీ నేత రాజా సింగ్ - చైనా ప్రభుత్వాల మధ్య పెద్ద రచ్చే మొదలైంది. అదేదో రాజా సింగ్ నుంచి వినిపించిన ఓ మాటను పట్టేసుకుని... తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ చైనా సదరు వ్యాఖ్యలను ఖండిస్తే... దానికి ఏమాత్రం వెనక్కు తగ్గని రాజా సింగ్ కూడా చైనాకు అదిరిపోయే స్పందనను వదిలారు. రాజా సింగ్ స్పందనపై ఎలా స్పందించాలో కూడా తెలియక చైనా తల పట్టుకుంది. మొత్తంగా రాజా సింగ్ వర్సెస్ చైనా రచ్చలో చివరకు చైనానే బుక్కయ్యేలా కనిపిస్తోంది.

ఈ రచ్చ పూర్తి వివరాల్లోకి వెళితే... మొన్నామధ్య కరోనా వైరస్ పై భారత దేశం సాగిస్తున్న పోరులో భాగంగా ఈ నెల 5వ తేదీన రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ దీపాలన్నీ ఆర్పేసి కొవ్వొత్తులను ప్రదర్శిద్దాం అన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు... భారత్ వ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగాయి. ఈ సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలో కొవ్వొత్తులను పట్టుకున్న రాజా సింగ్... కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ అంటూ నినదించారు. ఎక్కడో హైదరాబాద్ పాతబస్తీలో రాజా సింగ్ నోట వినిపించిన ఈ మాట చైనాను బాగానే కలవరపెట్టిందట.

అంతే... ముందూ వెనుకా ఆలోచించకుండా రంగంలోకి దిగేసిన చైనా... భారత్ లోని తన రాయబారి నుంచి ఓ ప్రకటన విడుదల చేయించింది. చైనీస్ వైరస్ అంటూ రాజా సింగ్ చేసిన వ్యాఖ్యను ఖండించింది. అంతేనా... అసలు కరోనా వైరస్ గురించి మొదట ప్రపంచానికి చెప్పింది తామేనంటూ చైనా రాయబారి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనను చూసినంతనే రాజా సింగ్ కూడా కాస్తంత ఘాటుగానే స్పందించారు. కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ అని అన్నది తానొక్కడినే కాదని.. తన కంటే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే మాట అన్నారని రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ప్రస్తావనను తీసుకొచ్చిన రాజా సింగ్...చైనాను బాగానే ఇరుకున పెట్టేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ట్రంప్ ప్రస్తావన తీసుకొచ్చిన రాజా సింగ్ స్పందనకు చైనా ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి. అసలు ట్రంప్ విషయం ఎంట్రీ ఇచ్చాక.. చైనా మరోమారు దీనిపై నోరిప్పుతుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.