Begin typing your search above and press return to search.
షాకిచ్చేలా వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్
By: Tupaki Desk | 15 Dec 2018 4:24 AM GMTకొంతమంది నేతల నోళ్లు తిన్నగా ఉండవు. ఒకవేళ ఉండే.. వారికున్న వివాదాస్పద నేత అన్న ట్యాగ్ కు ఇబ్బంది కలుగుతుంది కదా? బీజేపీకి చెందిన పలువురు నేతలు ఏ మాత్రం సహకరించకున్నా.. ఒంటరిగా.. తనకున్న ఛరిష్మాతో పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ బీజేపీలో ఒకే ఒక్కడైన రాజాసింగ్ గా చెప్పాలి.
అతివాద హిందుత్వ వ్యాఖ్యల్ని అదే పనిగా చేయటం.. రెచ్చగొట్టే ప్రసంగాలు.. రక్తం వేగంగా పరుగులు తీసేలా వ్యాఖ్యలు చేయటం రాజాసింగ్ కు అలవాటే. తాజాగా ముగిసిన ఎన్నికల్లో గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తెలంగాణ బీజేపీలో స్టాల్ వాల్స్ లాంటి నేతలంతా ఓటమి బాటలో ఉండిపోతే.. రాజాసింగ్ మాత్రం తనదైన ఇమేజ్ తో గెలుపును సొంతం చేసుకున్నారు.
తాజాగా ఆయన నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. గోహత్యలు చేసే వారిని బతకనివ్వనంటూ ఆయన వార్నింగ్ ఇచ్చేశారు. ఇప్పటికే గోహత్యల మీద నడుస్తున్న రచ్చ సరిపోదన్నట్లుగా రాజాసింగ్ నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు మరింత వేడిని పుట్టిస్తాయని చెప్పక తప్పదు. తనను ఎమ్మెల్యేగా గెలవకుండా చేసేందుకు కొద్ది మంది తీవ్రంగా ప్రయత్నించారని.. వారి గురించి తనకు తెలుసన్నారు.
ఈ రోజు (శనివారం) తన గెలుపును పురస్కరించుకొని విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తామని రాజాసింగ్ పేర్కొన్నారు. ఇంతకీ విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఉందా? రాజాసింగ్ లాంటోడి నీడ సైతం ఇష్టపడని మహమూద్ అలీ లాంటి హోం మినిస్టర్ పవర్లో ఉన్నప్పుడు రాజాసింగ్ లాంటి నేత చేసే ర్యాలీలకు పర్మిషన్ ఇస్తారా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. కిందామీదా పడి గెలిచిన రాజాసింగ్.. మొదట గోషామహల్ నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా.. ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా?