Begin typing your search above and press return to search.

ఆలయ కబ్జాపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   16 Dec 2020 12:54 PM GMT
ఆలయ కబ్జాపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు
X
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి సారి హిందుత్వ ఎజెండాతో హైదరాబాద్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాజాసింగ్ తాజాగా మరోసారి ఎంఐఎం నేతలపై అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఖాళీ మాత ఆలయాన్ని ఎంఐఎం నేతలు కబ్జా చేయాలని చూస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో 3 సార్లు వేలం వేయడానికి ప్రయత్నం చేస్తే స్థానికులు, బీజేపీ నేతలు అడ్డుకున్నారని వివరించారు. 8 ఎకరాల స్థలం, గజం 30వేల వరకు ఉంటుందని తెలిపారు. కానీ ఇప్పుడు నర్సింహారెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాడని వివరించారు.

దేవాదాయ శాఖ అధికారులు కోర్టుకు హాజరు కాకుండా భూ కబ్జాకు సహకరించారంటూ రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు.దేవాలయ భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా అని ఆయన ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే ఎండోమెంట్ మినిస్టర్ ఏసీలో పడుతున్నాడా? అంతూ తీవ్రంగా దుయ్యబట్టాడు.

సీఎం కేసీఆర్, ఎంఐఎంతో పోతే గ్రేటర్ ప్రజలు ఏం చేశారో చూశారు కదా అని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. వాళ్లతో వెళితే మీరు సర్వనాశనం అవ్వడం ఖాయం అని ఆరోపించారు. మహిళలలు అని కూడా చూడకుండా లాఠీచార్జీ చేశారు.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే అని పోలీసులను ప్రశ్నించారు రాజాసింగ్.