Begin typing your search above and press return to search.
వాళ్లని కాల్చి చంపేయాలి..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 31 March 2020 11:30 AM GMTదేశంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ కంట్రోల్ లోకి వస్తుంది అని అనుకుంటున్న తరుణంలోనే మళ్లీ దేశంలో కరోనా భయం ఒక్కసారిగా పెరిగిపోయింది. దానికి ప్రధాన కారణం ఢిల్లీలోని నిజాముద్దీన్ వద్ద మార్చి 13 నుంచి 15 మధ్య జరిగిన మతపరమైన భారీ ప్రార్థన సభ (మర్కజ్). కరోనా తో దేశం మొత్తం అల్లకల్లోలం అవుతున్న సమయంలో ఇలాంటి సభలు ఎలా నిర్వహిస్తారని , దేశంలో అప్పటికే కరోనా ముప్పు ఉన్నందున ఈ సభకు ఎలా అనుమతి ఇచ్చారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిలదీశారు.
ఈ సభకి దేశంలో మొత్తం ఆరు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వ్యక్తులు హాజరయ్యారని , అంతేకాక, ఇండోనేసియా సహా విదేశాల నుంచి ఎంతో మంది మత ప్రబోధకులు ఈ సభకు వచ్చి ప్రసంగించారని అయన తెలిపారు. ఈ ఘటన పై మంగళవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.ఈ సభకు హాజరైన వారే ఎక్కువ మంది కరోనా పాజిటివ్‌లుగా తేలుతుండడం తో వారికి సంబంధించిన వారికి వైద్యాధికారులు పరీక్షలు జరుపుతున్నారని అన్నారు.
అయితే, కొన్ని రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వారు సహకరించడం లేదని, అలాంటివారిని కాల్చి పారేయాలని వ్యాఖ్యానించారు. వారిని చంపేసి దేశాన్ని, తెలంగాణ, ఏపీని కాపాడుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంత మంది వల్ల అందర్నీ ప్రమాదంలో పెట్టలేమని అన్నారు. మొత్తం ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తాను కోరుతున్నానని, ఆ ప్రార్థనలతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని , వారు సహకరించకపోతే వారిని అక్కడే కాల్చి పారేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.