Begin typing your search above and press return to search.
ఎవరేమనుకున్న చంద్రబాబే నాకు బాస్: బీజేపీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 8 March 2021 4:25 AM GMTతెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనకు బాస్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడివి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి.
టీడీపీకి ఒకప్పుడు బీజేపీ మిత్రపక్షం.. వాజ్ పేయి హయాం నుంచి మోడీ హయాం వరకు ఈ రెండు పార్టీలు స్నేహం చేశాయి. కానీ ప్రత్యేక హోదా ఇవ్వని మోడీ సర్కార్ పై 2018లో నాటి సీఎం చంద్రబాబు విభేదించి ఎన్టీఏనుంచి బయటకు వచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా నాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పంచన చేరి రాజకీయం చేశారు. ఇప్పుడు సైలెంట్ అయినా కూడా బీజేపీకి, టీడీపీకి మధ్య ఆ గ్యాప్ అలానే ఉండిపోయింది.
అయితే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం తనకు ఎప్పటికీ చంద్రబాబే తనకు బాస్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తాను తొలుత టీడీపీ కార్పొరేటర్ గానే గెలిచానని.. ఆ తర్వాత బీజేపీలో చేరితే చంద్రబాబు గారే తనకు లిఫ్ట్ ఇచ్చారని.. కొంత మంది నన్ను తొలగించాలని.. టికెట్ ఇవ్వవద్దని అన్నా చంద్రబాబు వల్లే తన రాజకీయం జీవితం ఇప్పుడు ఎమ్మెల్యే స్తాయికి చేరిందని రాజాసింగ్ వ్యాక్యానించారు.
రాజాసింగ్ ను తీయకపోతే వెళ్లిపోతామని కొందరు అనడంతో చంద్రబాబును ఇబ్బంది పెట్టలేక తాను టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాల్సి వచ్చిందని రాజాసింగ్ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
అప్పటికీ ఇప్పటికీ తనకు రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబు ‘తన బాస్’ అంటూ ఈ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజాసింగ్ బీజేపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే. హిందుత్వ, గోవధపై పెద్దఎత్తున పోరాడుతూ జాతీయ గుర్తింపు పొందాడు. అందరు ఓడిపోయినా తెలంగాణలో బీజేపీ తరుఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కావడం విశేషం. ఇప్పుడాయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.