Begin typing your search above and press return to search.
పద్మావతి రచ్చలోకి హైదరాబాదీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 22 Nov 2017 5:27 AM GMTదేశ వ్యాప్తంగా భారీ చర్చకు తెర తీయటమే కాదు.. వాదోపవాదాలు.. హాట్ హాట్ చర్చలకు నెలవుగా మారింది బాలీవుడ్ చిత్రం పద్మావతి. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయకూడదంటూ పలువురు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చరిత్రను వక్రీకరించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీశారని మండిపడుతున్న వైనం తెలిసిందే.
తాజాగా ఈ మంటలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నా.. రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ కొరతను తీరుస్తూ తాజాగా హైదరాబాద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పద్మావతిపై తన గళాన్ని విప్పారు. చరిత్రను వక్రీకరించేలా సినిమా తీస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. తాజాగా హైదరాబాద్ లోని బేగంబజారులో ఉన్న భూలక్ష్మి టెంపుల్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ నిరసన ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. క్షత్రియుల మనోభావాలు దెబ్బ తీసేలా ఈ చిత్రం ఉందని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. ఈ సినిమా రిలీజ్ ను తెలంగాణలో నిలిపివేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు బీజేపీ నేతలు కోరారు.
షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 1న విడుదల కావాల్సి ఈ చిత్రం వివాదాల్లోకి చిక్కుకుపోవటంతో రిలీజ్ ను వాయిదా వేశారు. తాజాగా ఈ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునివ్వటమే కాదు.. నిరసన ర్యాలీ చేయటం.. సీఎంకు వినతి పత్రాన్ని పంపటం లాంటివి చూస్తే.. పద్మావతి మూవీ తెలుగు రాష్ట్రాల్లోనూ వివాదాలకు నెలవుగా మారనుందా? అన్న సందేహం కలగక మానదు.