Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి టంగ్ స్లిప్ కొంప‌ముంచుతుందా?

By:  Tupaki Desk   |   8 Oct 2022 8:30 AM GMT
కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి టంగ్ స్లిప్ కొంప‌ముంచుతుందా?
X
మునుగోడు ఉప ఎన్నిక ముహూర్తం రెడీ అయింది. నామినేష‌న్ల ప‌ర్వం కూడా కొన‌సాగుతోంది. అయితే.. ఈ క్ర‌మంలో బీజేపీ త‌ర‌ఫున ఇంకా ఖ‌రారు కాని.. అభ్య‌ర్థి..ఇక్క‌డ నుంచి గెలిచి.. ఇటీవ‌ల కాడి వ‌దిలేసిన‌.. మాజీ కాంగ్రెస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి.. మునుగోడులో ఎక్క‌డికక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు. ఎవ‌రికి వారిని క‌లుస్తూ.. ప్ర‌చారం జోరును పెంచారు. అధికార పార్టీ టీఆర్ ఎస్‌పైనా.. తాను రాజీనామా చేసిన కాంగ్రెస్‌పైనా.. ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లే చేస్తున్నారు.

అయితే.. కోమ‌టిరెడ్డి దూకుడులో.. ఒక్కొక్క‌సారి టంగ్ స్లిప్ అవుతోంది. ఇది ఆయ‌న కొంప‌ముంచ‌డం ఖాయ మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌కు అన్యాయం చేశార‌ని.. టికెట్ ఇచ్చి.. ఎమ్మెల్యేగా.. గ‌తంలో ఎంపీగా గెలిపించిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పోడిచి.. బీజేపీలో చేరార‌ని.. కాంగ్రెస్ నేత‌లు కోమ‌టిరెడ్డిపై తెగ యాంటీ ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు.. కాంట్రాక్టుల కోసం.. వ్యాపారాల కోసం.. కోమ‌టిరెడ్డి పార్టీ మారార‌ని కూడా కాంగ్రెస్ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో కోమ‌టిరెడ్డి ఆచి తూచి మాట్లాడాలి. తాను ఎందుకు పార్టీ మారిందీ జాగ్ర‌త్త‌గా ప్ర‌చారం చేసుకోవాలి. ప్ర‌జ‌ల‌కు చెప్పుకోవాలి. కానీ, ఆయ‌నే స్వ‌యంగా నోరు జారుతున్నారు.

తాజాగా ఆయ‌న ఒక మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. చేసిన కొన్ని వ్యాఖ్య‌లు.. తీవ్ర దుమారం రేపాయి. త‌న‌కు 18 వేల కోట్ల రూపాయ‌లు విలువ చేసే కాంట్రాక్టులు వ‌చ్చాయ‌ని.. క‌న్ఫ‌ర్మ్ చేసి మ‌రీ చెప్పాడు. అంటే.. తాను కాంగ్రెస్‌లో ఉంటే.. ఇవి రావ‌నే క‌దా. అందుకే తాను పార్టీ మారాన‌ని చెప్పిన‌ట్టు అయింది క‌దా!

అంతేకాదు.. తాను కాంగ్రెస్‌లో గెలిచి మూడేళ్లు అయింద‌ని.. అయితే.. అప్ప‌టి సంది.. తాను.. కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగానే పోరాడుతున్నాన‌ని.. మ‌రో పొర‌పాటు మాట్లాడేశారు. నిజానికి కాంగ్రెస్ ఎంతో మంది పోటీలో ఉన్నా.. 2018లో ఆచితూచి కోమ‌టిరెడ్డి టికెట్ ఇచ్చింది. గెలిపించింది. కూడా.. ఇప్పుడు ఆ పార్టీకి వ్య‌తిరేకంగా.. ఉన్నాన‌ని స్వ‌యంగా ఆయ‌న చెప్పేశాడు. ఇక‌, బీజేపీకి మూడేళ్లుగా స‌పోర్టుగా ఉన్నాన‌న్న విష‌యాన్ని కూడా ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు.

అంటే.. ఈ ప‌రిణామాల‌తో కాంగ్రెస్ ను కోమ‌టిరెడ్డి మోసం చేశారనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది క‌దా! మ‌రోవైపు.. త‌న అన్న‌, ఎంపీ.. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిని కూడా.. రాజ‌కీయంగా త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేశాడు. ''మా అన్న వెంక‌ట‌రెడ్డి.. న్యాయం వైపు ఉంటాడు'' అని వ్యాఖ్యానించారు. దీనిని బ‌ట్టి.. న్యాయం అన‌ని చెప్పి.. అన్న‌ను కూడా.. ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి కోమ‌టిరెడ్డి టంగ్ స్లిప్ అయి చేస్తున్న వ్యాఖ్య‌లు.. ఆయ‌న చుట్టూతానే వివాదాన్ని పెంచుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.