Begin typing your search above and press return to search.
అధికార పార్టీ మహిళా మేయర్‌కు అవమానం
By: Tupaki Desk | 26 Nov 2017 12:57 PM GMTఅధికారుల తొందరపాటు కారణం కావచ్చు...లేదా కొందరు పేర్కొంటున్నట్లు ఉద్దేశపూర్వకం అయి ఉండవచ్చు కానీ... అధికార పార్టీ మహిళా నేతకు ఊహించని షాక్ తగిగింది. దీంతో ఏకంగా సదరు నాయకురాలు వేదికపైనే ఏడ్చింది. ఈ సంఘటనకు సాక్షిగా ఉన్న సొంత పార్టీ మంత్రికి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జరిగింది రాజమహేంద్రవరంలో. సదరు అవమానభారం ఎదుర్కుంది...నగర మేయర్ రజినీ శేషసాయి. సంఘటన చోటుచేసుకుంది రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయ కళాశాల సముదాయం శంకుస్థాపన కార్యక్రమంలో.
నాబార్డ్ ఆర్‌ఐడీఎఫ్ నిధులతో కళాశాల సముదాయం నిర్మాణం జరగనున్ననేపధ్యంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ నిర్మాణ సముదాయానికి శంకుస్థాపనచేశారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయచౌదరి - శాసన సభ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో పాటు మేయర్ పంతం రజినీ శేషసాయి తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే శంకుస్థాపన శిలాఫలకంపై తన పేరు లేదన్న విషయాన్ని మేయర్ రజినీశేషసాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే అధికారులు పొంతనలేని సమాధానం చెప్పడంతో అసహనం వ్యక్తం చేసిన మేయర్ సభావేదికపై కంటతడి పెట్టుకున్నారు.
అనంతరం అక్కడే ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసి...అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా, అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ రకంగా వ్యవహరించారనే అభిప్రాయాలను ఆమె సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇలాంటి చిన్నవిషయాలకు ఏడ్వటం సరికాదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. తమకు పబ్లిసిటీ కంటే ప్రజాసేవే ఎక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు.