Begin typing your search above and press return to search.
నమ్మగలరా..ఈయన ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి!
By: Tupaki Desk | 29 April 2019 5:57 AM GMTపంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన వ్యక్తి ఇచ్చే బిల్డప్పులే పతాక స్థాయిలో ఉండే రోజులు ఇవి. రాజకీయం ఎంతో గ్లామరస్ వృత్తిప్పుడు. అలాంటి వృత్తిలోకి దిగిన వాళ్లు తమను తాము అందరికీ అతీతులమని భావించేస్తూ ఉంటారు. ఓటు అడిగి వేయించుకునే వాళ్లే అయినా, వీళ్లు తమను తాము దైవాంశ సంభూతులుగా భావించేస్తూ ఉంటారు. కింది స్థాయి లీడర్లలో ఈ జాడ్యం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
మరి ఇలాంటి రాజకీయంలో ఒక ప్రముఖ పార్టీ తరఫు నుంచి ఎంపీగా పోటీ చేసిన ఒక అభ్యర్థి స్నేహితులతో ఇలా సరదాగా క్రికెట్ ఆడటం అంటే అది కచ్చితంగా ప్రత్యేకమైన విషయమే అవుతుంది. ఫొటోలోని వ్యక్తి రాజమండ్రి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీలో ఉన్న మార్గాని భరత్ రామ్.
ఇతడు గెలుస్తారా - ఓడతారా..అనే అంశం గురించి డిస్కషన్ కాదిక్కడ. ఎన్నికల పోలింగ్ ముగిశాకా - అంతా ఫలితాల గురించి ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వేళ ఇలా స్నేహితులతో క్రికెట్ ఆడుతూ అతడు సేదతీరుతుండటమే ఆసక్తిదాయకమైన అంశం.
పోలింగ్ అయ్యాకా చాలా మంది రాజకీయ నేతలు విహారాలకు - విశ్రాంతులకు విదేశాలకు వెళ్లిపోగా.. ఈ యువ ఎంపీ అభ్యర్థి మాత్రం ఇలా స్నేహితులతో క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఈ ఎన్నికల్లో గెలిచినా భరత్ ఇలాంటి సింప్లిసిటీనే మెయింటెయిన్ చేసి జనాలకు అందుబాటులో ఉంటే.. మరింత మంది యువకులకు కూడా రాజకీయంలో ఆదరణ పెరిగే అవకాశం ఉంది.