Begin typing your search above and press return to search.
రాజయ్య విధేయత!
By: Tupaki Desk | 25 July 2015 12:31 PM GMTఏమైనా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులే. ఎంత విధేయుడైనా.. చూస్తూ..చూస్తూ బంగారం లాంటి పదవిని ఒక్క కలంపోటుతో తీసిపారేస్తే ఎవరికి మాత్రం కడుపు మంట ఉండదు. తాను కలలో కూడా ఊహించని డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టినప్పుడు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడికి ప్రతిరూపంగా కనిపించిన రాజయ్యకు.. ఇప్పుడు మాత్రం ఆయనలోని చాలా కోణాలు కనిపిస్తున్నాయి.
చేతికి వచ్చిన పదవిని చేతులారా చేజార్చుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య చాలాకాలం తర్వాత నోరు విప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నాటి నుంచి ఇప్పటివరకూ మౌనంగా ఉన్నా.. తాజాగా మాత్రం ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
అధినేత మనసు తెలిసి కూడా.. లోపలున్న అసంతృప్తిని దాచుకోలేనట్లుగా రాజయ్య మాటల్ని చూస్తే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తలుచుకుంటేనే తెలంగాణలో ఎవరికైనా పదవులు వస్తాయని.. అంతేకానీ.. టీఆర్ ఎస్ పార్టీలో డిమాండ్లు చేస్తే.. పదవులు రావంటూ బంగారం లాంటి మాటలు చెప్పుకొచ్చారు. ఈ మాటలు ఎంత నిజమన్నది.. అనుభపూర్వకంగా తెలుసుకున్న రాజయ్య.. బహిరంగంగా చెప్పి మరో తప్పుచేశారన్న వాదన వినిపిస్తోంది.
కేసీఆర్ మనసు ఎలా ఉంటుందో తెలిసి కూడా.. రాజయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేయటం టీఆర్ ఎస్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి పోయిందన్న బాధ ఉంటుందన్న విషయం తెలిసినప్పటికీ.. కామ్ గా ఉండకుండా ఇలాంటి మాటలు.. మరింత నష్టాన్ని కలిగిస్తాయన్న సత్యాన్ని రాజయ్య ఎందుకు మిస్ అవుతున్నారని ఆయన సన్నిహితులు బాధ పడుతున్నారు.
మున్సిపల్.. పంచాయితీ కార్మికుల సమ్మెకు వ్యక్తిగతంతా తాను మద్ధతు పలుకుతున్నట్లు పేర్కొన్న ఆయన.. త్వరలోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశను వ్యక్తం చేశారు. కార్మికుల సమ్మెను ముఖ్యమంత్రి పరిష్కరిస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పిన రాజయ్య.. ఇంతకాలం మౌనంగా ఉండి ఇప్పుడే ఎందుకు నోరు విప్పారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజయ్యది వ్యూహాత్మక వ్యాఖ్యలా? లేక.. లోపల దాచుకున్న అసంతృప్తి జ్వాల అనుకోకుండా బయటపడిందా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.