Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే సారూ..ఏంటయ్యా ఇది ?

By:  Tupaki Desk   |   2 July 2020 7:30 PM IST
ఎమ్మెల్యే  సారూ..ఏంటయ్యా ఇది ?
X
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ మహమ్మారిని అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఏపీలో ప్రతి రోజు కూడా దాదాపుగా 700 కి పైగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దీనితో అందరిలో ఆందోళన మొదలైంది. అయితే ఇటువంటి సమయంలో ప్రభుత్వ విధి విధానాలను సక్రమంగా పాటించి .. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు సైతం కరోనా నియమాలని తుంగలో తోక్కేస్తున్నారు. భౌతిక దూరం పాటించండి అని చెప్పాల్సిన వారే ఏ మాత్రం భౌతిక దూరం పాటించకుండా సంబరాల్లో మునిగితేలుతున్నారు.

కాగా , నిన్న ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైద్యం పై విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ఒకేసారి 1088 అంబులెన్స్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఎంతో అట్టహాసంగా నిర్వహించారు ..ఈ కార్యక్రమం నిర్వహించిన కొద్దీ సమయంలోనే రాజమహేంద్రవరంలో వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రూల్స్ బ్రేక్ చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలని ఒక చోట పోగు చేసి హుంగామ చేసారు. వందలమంది బ్యాండ్ చప్పుళ్ల మధ్య డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు.