Begin typing your search above and press return to search.
డిజైన్ల పర్వంలో బాబు జక్కన్న భేటీ!
By: Tupaki Desk | 20 Sep 2017 8:21 AM GMTనాకు సినిమాలు తెలుసు. సినిమాలకు అవసరమైన సెట్టింగులు తెలుసు. రాజధాని నిర్మాణం కోసం నిర్మించే కట్టడాల డిజైన్లకు సలహాలా?అంటూ తానేం చెప్పాలనుకున్నారో ఆ విషయాన్ని సూటిగా కాకున్నా.. చెప్పాల్సిన రీతిలో మర్యాదగానే చెప్పేశాడు ప్రముఖ దర్శకుడు రాజమౌళి అలియాస్ జక్కన్న.
బాహుబలి లాంటి బ్లాక్‌బస్టర్ మూవీని అందించిన ఆయన.. తన సృజనతో ప్రపంచ సినిమా పరిశ్రమ టాలీవుడ్ వైపు చూసేలా చేశారు. అందరి సంగతేమో కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు రాజమౌళి మీద ఫోకస్ చేశారు. ఏపీ ప్రజల రాజధాని అమరావతిలో నిర్మించే కట్టడాలకు సంబంధించిన డిజైన్లకు రాజమౌళి సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు.
ఒక మహాద్భుతమైన నిర్మాణాలకు సలహాలు సూచనలు కావాలంటే ఆయా రంగంలో లబ్థప్రతిష్ఠులైన వారు అవసరం. ఈ విషయం ఎవరిని అడిగినా చెబుతారు. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సినీ దర్శకులు రాజమౌళిని సలహా కావాలని కోరుతున్నారు. బాహుబలి సినిమాలో రెండు రాజ్యాల్ని అద్భుతంగా చూపించిన జక్కన్నకు రాజధాని అమరావతిలో ఎక్కడేం ఉండాలో ఆయన కానీ చెబితే అదిరియేలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తుంది.
అందుకే.. తనకు అవగాహన లేదన్న విషయాన్ని మర్యాదగా చెప్పిన తర్వాత (ఒక ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పరోక్షంగా చెప్పారు) కూడా మంత్రులను పంపిన బాబు తాజాగా తనతో భేటీకి ఆహ్వానించారు.
చంద్రబాబుతో భేటీ అయిన రాజమౌళి రాజధాని నిర్మాణాలకు సంబంధించి తన ఆలోచనల్ని పంచుకునే కన్నా.. బాబుకేం కావాలన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నట్లుగా చెబుతున్నారు. అసెంబ్లీ.. హైకోర్టు భవనాలకు లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్ల గురించి చర్చించారు. డిజైన్లను చూడటం.. వాటిని ఆకర్షణీయంగా తయారు చేయించటంతో పాటు.. వాటిని ఎక్కడ నిర్మించాలన్న సలహాలు.. సూచనలు ఇవ్వాలని రాజమౌళిని కోరినట్లుగా చెబుతున్నారు. ఇందుకు ఆయన అంగీకరించారు.
మధ్యాహ్నం మరోసారి బాబును కలిసి.. డిజైన్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని రాజమౌళి సేకరించనున్నారు. డిజైన్ల వ్యవహారం సీరియల్ మాదిరి సాగుతున్న నేపథ్యంలో వాటిని త్వరగాపూర్తి చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. డిజైన్ల మార్పులు చేర్పుల కోసం సీఆర్‌డీఏ అధికారులు మరోసారి లండన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
వీలైతే ఈ నెలాఖరున లేకుండా వచ్చే నెల మొదటి వారంలో లండన్‌కు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. తమతో పాటు దర్శకుడు రాజమౌళిని కూడ లండన్‌కు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే సూచనను చంద్రబాబు కూడా చేశారు. తన సినిమాకు అవసరమైన సినిమా సెట్టింగుల్ని తనకు నచ్చినట్లు రాబట్టుకునే రాజమౌళి..రాజధాని డిజైన్లను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నచ్చినట్లుగా నార్మన్ ఫోస్టర్ బృందం నుంచి చేయించగలరా? అన్నది ప్రశ్న. సినిమాలో దర్శకుడే కెప్టెన్. నిర్మాత పూర్తి నమ్మకంతో దర్శకుడి మీద భరోసా పెట్టి ప్రాజెక్టు మొత్తం అప్పగిస్తాడు. మరిక్కడ జక్కన్న మీద నమ్మకంతో డిజైన్ల సలహాలు ఇవ్వాలని బాబు కోరుతున్నారు. బాబుకు నచ్చినట్లుగా జక్కన్న డిజైన్లు సిద్ధం చేయించగలుగుతారా? అన్నది పెద్ద ప్రశ్న. దీనికి కాలం మాత్రమే సరైన సమాధానం ఇవ్వగలదు.